తండేల్ మండే టెస్ట్ పాస్.. నాలుగు రోజల్లో 73 కోట్లు.. నాలుగో రోజు 73 వేల టికెట్ లు..
అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాల వర్షం కురిపిస్తుంది. నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తోంది.

అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాల వర్షం కురిపిస్తుంది. నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తోంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ప్రతి థియేటర్లో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. దీనితో నిర్మాత అల్లు అరవింద్ కు భారీ లాభాలు వస్తున్నాయి. సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్లందరూ వస్తున్న వసూళ్లు చూసి షాక్ అవుతున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు మరో సినిమా నుంచి ఇబ్బంది లేదు.
ఇప్పట్లో భారీ బడ్జెట్ సినిమాలు ఏమీ రిలీజ్ కు సిద్ధంగా లేవు. విశ్వక్సేన్ హీరోగా వచ్చే లైలా సినిమా కూడా ఈ సినిమాను అడ్డుకునే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చేస్తుంది. అమెరికాలో ఇప్పటికే దాదాపు 8 లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా త్వరలోనే పది లక్షల డాలర్లు వసూలు చేసే ఛాన్స్ కనబడుతోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈవారం కూడా మరో సినిమా రిలీజ్ లేదు. దీనితో వసూళ్లు భారీగానే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా మండే టెస్ట్ కూడా పాస్ అయిపోయింది. వాస్తవానికి వీకెండ్ తర్వాత సోమవారం సినిమాకు టికెట్లు బుక్ అవ్వడం చాలా కష్టం. అయినా సరే సోమవారం బుక్ మై షో లో ఏకంగా 73 వేలకు పైగా టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాకు సోమవారం కూడా సాలిడ్ వసూళ్లు వచ్చాయి. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 73 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అనౌన్స్ చేశారు. అంటే మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల మార్క్ దాటడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలో కచ్చితంగా వన్ మిలియన్ మార్క్ అందుకోవడానికి ఈ సినిమా దగ్గర్లోనే ఉంది. ఈ వారంలో కూడా అమెరికాలో భారీ బడ్జెట్ సినిమాలు గానీ పెద్ద సినిమాలు గానీ రిలీజ్ అవ్వడం లేదు. దీనితో ఈ సినిమాకు అక్కడ ఇబ్బంది లేకపోవచ్చు. ఇక వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో కచ్చితంగా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ కనబడుతుంది. త్వరలోనే 100 కోట్ల మార్పు చేరుకొని 150 కోట్లు దిశగా సినిమా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటిటి రైట్స్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ఎవరికి విక్రయిస్తారనే దానిపై నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వటం లేదు. మరో 20 రోజులు సినిమా థియేటర్లలోనే రన్ చేయాలని ఆ తర్వాత ఓటిటి విషయంలో దృష్టి పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ఖచ్చితంగా మరో 60 నుంచి 70 కోట్లు సినిమా కలెక్ట్ చేసే అవకాశాలు ఉండడంతో అనవసరంగా తొందర పడొద్దు అని అల్లు అరవింద్ భావిస్తున్నారట.