తండెల్ రివ్యూ; హిట్ కొట్టాడు

అక్కినేని వారసుడు నాగ చైతన్యకు గత కొన్నాళ్ళుగా సరైన హిట్ లేదు. సినిమాలపై పిచ్చి ఉన్నా సరే ఈ యంగ్ హీరోకు సరైన హిట్స్ పడటం లేదు. కష్టపడుతున్నా సరే రిజల్ట్ మాత్రం శూన్యం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2025 | 01:31 PMLast Updated on: Feb 07, 2025 | 1:31 PM

Tandel Movie Review

అక్కినేని వారసుడు నాగ చైతన్యకు గత కొన్నాళ్ళుగా సరైన హిట్ లేదు. సినిమాలపై పిచ్చి ఉన్నా సరే ఈ యంగ్ హీరోకు సరైన హిట్స్ పడటం లేదు. కష్టపడుతున్నా సరే రిజల్ట్ మాత్రం శూన్యం. ఇక ఇప్పుడు తండెల్ అనే సినిమాతో చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ రెండేళ్ళ పాటు కష్టపడ్డాడు. తన లుక్ విషయంలో చాలా పక్కాగా ఉన్నాడు. డైరెక్టర్ ఆలోచనకు తగ్గట్టు కథ రాసుకుని రంగంలోకి దిగాడు. మరి తండెల్ ఎలా ఉంది…? నాగ చైతన్యకు ఈసారి అయినా హిట్ దక్కిందా…? చూద్దాం.

ఈ మధ్య కాలంలో కల్పిత కథల కంటే నిజ జీవితాల మీద వచ్చిన సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకులు వాటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే డైరెక్టర్లు కూడా అలాంటి కథల కోసం వెంటాడుతున్నారు. ఇప్పుడు తండేల్ సినిమా కూడా అలా వచ్చిందే. ఓ జాలరి పొరపాటున పాకిస్తాన్ వెళ్ళిపోతాడు సముద్రంలో. అసలు సినిమా బ్యాక్ డ్రాప్ అదే. అక్కడ రెండేళ్ళ జైలు శిక్ష అనుభవించడం, కష్టాలు పడటం, అయినా సరే దేశభక్తి ఉండటం వంటి అంశాలతో సినిమాను డైరెక్టర్ ప్లాన్ చేసాడు. కాని కథలో.. ఇండియా – పాకిస్తాన్ ట్రాక్ అంతా ఇరికించారు అనే ఒపినియన్ వినపడుతుంది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ మాత్రం ఈ సినిమాలో హైలెట్ అయింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంది. కాని సెకండ్ ఆఫ్ తో పాటుగా కొన్ని సీన్స్ చాలా బాగా డైరెక్ట్ చేసాడు. ఇంటర్వెల్ సీన్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది.

ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు సినిమాలో డ్రామా పికప్ కాలేదు. కాని ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ ను బాగా ప్లాన్ చేసారు. కాని ఇంటర్వెల్ వరకు సినిమా ఫ్లాట్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే… ఎమోషనల్ రైడ్ తీసుకుని ఆకట్టుకుంది. కాని కథను చెప్పడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీ బాగా ప్లాన్ చేసాడు. ఫస్టాఫ్ ఒక 20 నిమిషాలు – సెకండాఫ్ 20 నిమిషాలు చాలా బాగుంది. ఆ సీన్స్ కోసం సినిమా చూడవచ్చు. ప్రేమికులు అయిన హీరో హీరోయిన్స్ కి ఒకరంటే ఒకరికి ప్రాణం. కాని అనుకుండా వీళ్ళు విడిపోవాల్సి వస్తుంది. హీరో పాకిస్థాన్ లో ఇరుక్కోగా వీళ్ళ ప్రేమ ఏమయింది, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా.

రొటీన్ కథ అయినా సరే సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ మాత్రం బాగుంటుంది. సినిమా చాలా వరకు ఫ్రెష్ ఫీల్ నే కలిగించింది అని చెప్పుకోవచ్చు. సినిమా ఓపెన్ అవ్వడమే ఆసక్తిగా స్టార్ట్ అయింది. లవ్ స్టోరీ ఇంట్రస్టింగ్ గా ప్లాన్ చేయడం వర్కౌట్ అయింది. ఇక్కడ దేవి శ్రీ మ్యూజిక్ హైలెట్ గా చెప్పుకోవాలి. సోల్ ఫుల్ మ్యూజిక్ తో సినిమాకు ఒక హైప్ తీసుకొచ్చాడు. హడావుడి బ్యాక్ డ్రాప్ లేకుండా ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు సెకండ్ ఆఫ్ ఎంత ప్రాణం పోసిందో.. దేవి శ్రీ మ్యూజిక్ కూడా అంతే. ఇక నాగ చైతన్య నటనతో దుమ్ము రేపాడు. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లాంగ్ రన్ కష్టమే గాని ప్రాఫిట్ గట్టిగానే రావచ్చు. యూత్ కి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. క్లాస్ ఆడియన్స్ కు ఈ స్టోరీ ఎంత వరకు నచ్చుతుందో చెప్పలేము. కాని పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కు రెడీగా లేకపోవడంతో ఈ సినిమా విషయంలో ఇబ్బంది లేదు.

ఇక సినిమాలో నటుల విషయానికి వస్తే.. ఉత్తరాంధ్ర యాస.. అంత వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ లో న్యాచురాలిటీ మిస్ అయింది. దేశభక్తిపై వచ్చిన డైలాగులు కూడా అలాగే పట్టు లేకుండా ఉన్నాయి. పాకిస్తాన్ – ఇండియా పార్ట్ సినిమాకు మైనస్ అయింది. సినిమాకు పట్టు కోల్పోవడానికి, ఒక ఫ్లో లో వెళ్తున్న సినిమాను నాశనం చేసింది ఆ పార్ట్ అనే చెప్పాలి. ఆడియన్స్ కు కొన్ని సీన్స్ బోర్ కొట్టించినా.. సాయి పల్లవి తన యాక్షన్ తో ప్రాణం పోసింది. నాగ చైతన్య కెరీర్ లో నటన పరంగా ఇది బెస్ట్ మూవీ అనే చెప్పాలి.