ఓవర్సీస్ లో తండేల్ డామినేషన్.. అల్లు మామకు డాలర్ల వర్షమే

ఈ రోజుల్లో సినిమా ఎంత బాగుంది అనేది కాదు... ఎంత కలెక్షన్ వచ్చింది అనేది లెక్క. బడ్జెట్ ఎంత.. లాభం ఎంత వచ్చిందని నిర్మాతలు చూసే పరిస్థితి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2025 | 01:23 PMLast Updated on: Feb 08, 2025 | 1:23 PM

Tandels Domination Overseas Allu Mamas Dollars Are Pouring In

ఈ రోజుల్లో సినిమా ఎంత బాగుంది అనేది కాదు… ఎంత కలెక్షన్ వచ్చింది అనేది లెక్క. బడ్జెట్ ఎంత.. లాభం ఎంత వచ్చిందని నిర్మాతలు చూసే పరిస్థితి. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తూ సినిమాలకు వసూళ్లను టార్గెట్ పెట్టుకొని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇదే టైంలో ఓవర్సీస్ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు నిర్మాతలు. ఓవర్సీస్ లో సినిమా హిట్ అయితే భారీగా వసూళ్లు రావటం… అలాగే అక్కడ జనాలు కూడా మన సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ప్లస్ పాయింట్.

తెలుగు వాళ్ళ సంఖ్య కూడా ఓవర్సీస్ లో భారీగా పెరిగిపోవడంతో నిర్మాతలు గట్టిగానే ఫోకస్ పెడుతున్నారు. అందుకే ప్రమోషన్స్ విషయంలో ఓవర్సీస్ ని కూడా టార్గెట్ చేసి ఈ మధ్యకాలంలో ఈవెంట్స్ ప్లాన్ చేశారు. సంక్రాంతికి రిలీజ్ అయిన రెండు సినిమాలు గేమ్ చేంజర్.. అలాగే డాకూ మహారాజ్ సినిమా ఈవెంట్ లు ఓవర్సీస్ లోనే జరిగాయి. ఈ రెండు సినిమాల్లో డాకు మహారాజ్ సూపర్ హిట్ అయింది. అమెరికాలో కూడా వసూళ్లు ఈ సినిమాకు బాగానే వచ్చాయి. అయితే గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదని చెప్పాలి.

ఇక ఇప్పుడు మన తెలుగు నుంచి భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన తండేల్ సినిమా ఓవర్సీస్ లో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రమోషన్స్ విషయంలో అమెరికాపై కూడా మూవీ టీం ఒక ప్లానింగ్ తో వెళ్ళింది. నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా… అమెరికాలో కూడా భారీగానే కలెక్షన్స్ సాధించే ఛాన్స్ కనబడుతోంది. అమెరికా మార్కెట్లో సాలిడ్ ఓపెనింగ్స్ తో తండేల్ సినిమా దుమ్ము రేపుతోంది. అమెరికాలో ప్రీమియర్స్ తోనే రెండు లక్షల డాలర్లకు పైగా గ్రాస్ అందుకుంది ఈ సినిమా.

డిస్ట్రిబ్యూటర్స్ లెక్కల ప్రకారం మరింత వసూలు చేసే అవకాశం ఉంది. దాదాపు మిలియన్ డాలర్లు అక్కడ వసూలు చేసే ఛాన్స్ ఉందని అంచనాలు ఉన్నాయి. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ప్లస్ అవుతుంది. ఇక సాయి పల్లవి సినిమాలో తీసుకోవడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అని మూవీ అనలిస్టులు అంటున్నారు. అటు యూకే, ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాకు భారీగానే వసూళ్లు వచ్చే ఛాన్స్ కనపడుతోంది. ఇక సౌత్ మార్కెట్ పై కూడా నాగచైతన్య ఈసారి గట్టిగానే ఫొటోస్ పెట్టాడు. నిర్మాత అల్లు అరవింద్ ఇతర భాషలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రమోషన్స్ కూడా చేయించారు. తమిళంలో ఎక్కువగా వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా చూస్తుంటే కచ్చితంగా తమిళ ఆడియోస్ కు నచ్చే విధంగానే ఉంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో తమిళనాడు ని ఎక్కువగా ఫోకస్ పెట్టారు.