తండెల్ సక్సెస్.. మరో వంద కోట్ల టార్గెట్ పెట్టుకున్న చైతూ

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన తండేల్ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊహించని రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్లు సొంతం చేసుకుంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 10:55 AMLast Updated on: Feb 13, 2025 | 10:55 AM

Tandels Success Chaitu Who Has Set A Target Of Another Hundred Crores

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన తండేల్ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊహించని రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్లు సొంతం చేసుకుంటుంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా దుమ్ము రేపుతుంది. ముఖ్యంగా అమెరికాలో వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నాగచైతన్యకు ఎప్పుడూ లేని మార్కెట్ క్రియేట్ అయింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుని రెండేళ్ల నుంచి కష్టపడుతున్న నాగచైతన్యకు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పాలి.

అటు డైరెక్టర్ కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్ చేసాడు. ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పాలి. ప్రమోషన్స్ కూడా సినిమాకు బాగా చేయడంతో జనాల్లోకి సినిమా దూసుకుపోయింది. అందుకే కలెక్షన్స్ విషయంలో నాగచైతన్య కెరియర్ లోనే ఫస్ట్ టైం 100 నుంచి 150 కోట్ల వరకు కలెక్ట్ చేసే సినిమాగా ఇది రికార్డులు క్రియేట్ చేయనుంది. అటు అక్కినేని ఫ్యామిలీ హీరోలు కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా 100 కోట్ల సినిమా లేదనే చెప్పాలి.

ఇప్పుడు ఆ కోరికలు కచ్చితంగా నాగచైతన్య తీర్చబోతున్నాడు. ఈ సినిమా ఐదు రోజుల్లో దాదాపు 82 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక మరో రెండు మూడు రోజుల్లో కచ్చితంగా 100 కోట్ల మార్కు దాటడం కాయంగా కనబడుతుంది. అమెరికాలో కూడా వన్ మిలియన్ డాలర్లు వసూలు చేయడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ఈ సినిమాకు మరిన్ని వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన నాగచైతన్య తన తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

లేటెస్ట్ గా డైరెక్టర్ చందు ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాగార్జున.. సార్ చైతన్యకు హిట్ రావడం పై మీరంతా సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు అంటూ.. ఇకనుంచి అన్ని సిక్సర్లే అని కీలక ప్రకటన చేశాడు. శోభితని ఉద్దేశించి మాట్లాడుతూ శోభిత మీరు తెలుగు బాగా మాట్లాడతారు. ఆ తెలుగుని మా హీరోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి.. ఎందుకంటే మేము భవిష్యత్తులో హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ సినిమాను ఈ తరానికి తగ్గట్టు తీర్చిదిద్దబోతున్నామని.. నాగచైతన్య చేస్తారు మనం చూడబోతున్నాం అంటూ సంచలన ప్రకటన చేశాడు.