Puri Jagannadh : ఇటు పూరి, అటు విజయ్ మధ్యలో తేజ సజ్జ
ముందుగా మహేష్ బాబుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేస్తానని అనౌన్స్ చేశాడు పూరి. కానీ ఎందుకో మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.

Teja Sajja in the middle of Puri and Vijay
ముందుగా మహేష్ బాబుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేస్తానని అనౌన్స్ చేశాడు పూరి. కానీ ఎందుకో మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో.. ఇప్పట్లో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండదని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ లాంటి హీరో దొరకడంతో.. ఏ మాత్రం లేట్ చేయకుండా జనగణమనను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. లైగర్ రిలీజ్ అవకముందే.. ముంబైలో గ్రాండ్‌గా షూటింగ్ మొదలు పెట్టి ఒకటి, అరా షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశాడు.
కానీ లైగర్ సినిమా.. ఇటు పూరి, అటు విజయ్ దేవరకొండకు దారుణమైన రిజల్ట్ ఇచ్చింది. ఈ దెబ్బతో మళ్లీ అటకెక్కింది జనగణమన. విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అవడంతో.. ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు పూరి. కానీ.. మరోవైపు జనగణమనను మరో హీరోతో రీ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తునే ఉన్నాడు. మధ్యలో బాలీవుడ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడని వినిపించగా.. ఇప్పుడు మాత్రం ఊహించని హీరోతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాదిలో హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. హనుమాన్ సినిమా తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న తేజ.. ప్రస్తుతం మిరాయ్, జై హనుమాన్ సీక్వెల్ చేస్తున్నాడు. ఇప్పుడు పూరితో ప్రాజెక్ట్ సెట్ అయితే.. తేజ జాక్ పాట్ కొట్టేసినట్టే. త్వరలో దీని పై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈసారైనా పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందేమో చూడాలి.