మా నాన్న గ్రాఫ్ ఇంపార్టెంట్.. బాలయ్య చిన్న కూతురు కామెంట్స్ వైరల్
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ రేంజ్ గత నాలుగైదు ఏళ్ల నుంచి బాగా పెరిగిపోయింది. ఆయన ఏ సినిమా చేసినా.. ఏ మాట మాట్లాడినా...
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ రేంజ్ గత నాలుగైదు ఏళ్ల నుంచి బాగా పెరిగిపోయింది. ఆయన ఏ సినిమా చేసినా.. ఏ మాట మాట్లాడినా… సరే సూపర్ హిట్ అవుతుంది. ఇక ఆయన మీడియాలో కనబడితే అభిమానులతో పాటుగా నార్మల్ సినిమా ఆడియన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన డాకూ మహారాజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. బాలకృష్ణ ఈ వయసులో కూడా అదే రేంజ్ లో ఎనర్జీ మైంటైన్ చేయడంతో, సినిమా మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కూడా నచ్చేసింది.
ఇక సినిమాలో డాన్స్ లు కూడా బాలయ్య దుమ్మురేపారు. ఇక యాక్షన్ సీన్స్ విషయంలో కూడా తనకు ఎవరు పోటీ రాలేరు అనే విధంగా బాలయ్య నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా రీసెంట్ గా ఆయనకు పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలయ్య అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. నందమూరి, నారా కుటుంబాలు కూడా ఈ విషయంలో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఒక ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇక బాలకృష్ణ కెరీర్ ఎంత ఎత్తులో ఉన్నా సరే ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. పైకి యాంగ్రీ గా కనిపించే బాలయ్య తన బంధుమిత్రుల ముందు బాలకృష్ణుడుగా మారిపోయి సందడి చేస్తూ ఉంటారు. ఇటీవల ఆయన సోదరీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి బాలయ్య కోసం ఒక పార్టీ అరేంజ్ చేశారు. ఇక స్టేజ్ పై ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను బాలయ్య గురించి షేర్ చేసుకున్నారు.
ఇక బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి మాట్లాడుతూ… తన చిన్నప్పుడు నాన్నని.. తాను, తేజస్విని ఇద్దరు అపార్థం చేసుకున్నామని… ఆయన ఎప్పుడూ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడరని… లోపల ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారని, అలా కొన్నిసార్లు నాన్న ఏంటి అలా అంటున్నాడని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళమని, కానీ ఎదిగిన తర్వాత అలా ఉండటం ఎంత అవసరమో అర్ధమైందని బ్రాహ్మణి కామెంట్ చేశారు. అలాగే అలా ఉండటం ఎంత కష్టమో కూడా అర్థమైంది అన్నారు. ఇక చిన్న కుమార్తె.. తేజస్విని మాట్లాడుతూ నాన్న గ్రాఫ్ పెరగడానికి తానే కారణమని సరదాగా కామెంట్ చేసింది.
ప్రస్తుతం వీళ్లిద్దరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. బాలయ్య రీసెంట్ గా సక్సెస్ కావడానికి కారణమైన చిన్న కుమార్తె తేజస్విని అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. బాలయ్య చేసే ప్రతి సినిమా స్టోరీ.. ముందు తేజస్విని విన్న తర్వాతనే ఫైనల్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా తేజస్విని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అటు ఆహాలో వచ్చే సెలబ్రిటీ టాక్ షో విషయంలో కూడా ఆమెను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.