SALAAR: సలార్ టిక్కెట్ ధరల పెంపు.. ఎంత పెంచారంటే..
సలార్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వీట్ న్యూస్ చెప్పారు. స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు.. టికెట్ రేటు పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. టికెట్ రేటుపై 65 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.
SALAAR: సలార్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. సలార్ ఫస్ట్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన యాక్షన్ కట్ ట్రైలర్ ఆడియన్స్‌లో సినిమాపై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో సలార్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వీట్ న్యూస్ చెప్పారు.
RAVI TEJA: హిట్ గ్యారెంటీ! రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ఆ మూవీకి రీమేకా..!
స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు.. టికెట్ రేటు పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. టికెట్ రేటుపై 65 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లో మొదటి వారం రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 21న అర్థరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది. ఐతే రాష్ట్రంలో పరిమితంగా 20 థియేటర్లలో మాత్రమే సలార్ బెనిఫిట్ షోకు అనుమతి ఉంటుంది. అటు ఆరో ఆట ప్రదర్శనకు కూడా అనుమతి ఇచ్చింది. ఉదయం 4 గంటల సలార్ షోకు అనుమతి ఉంది. తెలంగాణలో టికెట్ రేట్లు విషయానికి వస్తే.. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.250, రూ.175, రూ.100 రేట్లు ఉండగా.. మల్టీప్లెక్స్‌ల్లో రూ.370, రూ.470 రూపాయల ధరతో టికెట్స్ విక్రయిస్తారు. తెలంగాణ థియేటర్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ సలార్ సినిమాతో థియేటర్స్ దగ్గర పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
సలార్ సినిమా టికెట్స్ నైజాం వరకు థియేటర్స్ దగ్గరే అమ్ముతారని, ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్స్ ఉండవని చెప్పారు. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. దీంతో థియేటర్ దగ్గర అభిమానులు క్యూ కట్టారు. ఐతే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాలు చేయాలని నిర్ణయించారు. ఇక అటు ఏపీ సర్కార్ కూడా సలార్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మొదటి పదిరోజులు టికెట్ మీద 40 రూపాయలు పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.