Telangana Slang: బొమ్మ అదుర్స్‌.. పరేషాన్‌ చేశిన్రు కదరా బై..

ఈ మధ్య తెలంగాణ యాసతో వస్తున్న సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలుస్తున్నాయి. ఫిదా సినిమాతో స్టార్ట్‌ చేస్తే జాతిరత్నాలు, బలగం, దసరా, రీసెంట్‌గా మేము ఫేమస్‌ ఇలా చాలా సినిమాలు తెలంగాణ యాసతో వచ్చి హిట్‌ కొట్టాయి. దీంతో డైరెక్టర్స్‌కు ఇదో సక్సెస్‌ ఫార్ములాగా మారిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 2, 2023 | 02:02 PMLast Updated on: Jun 02, 2023 | 2:02 PM

Telangana Slang Movies On Bumper Hit

ఇప్పుడు ఇదే రూట్‌లో పరేషాన్‌ సినిమా వచ్చింది. తిరువీర్‌ హీరోగా రూపక్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇవాళ థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు పరేషాన్‌ అవుతున్నారు. ఫుల్‌ లెంత్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. కథ విషయానికి వస్తే హీరో ఐటీఐ ఫెయిలై ఊర్లోనే ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు. అతనికి ఎలాగైనా గవర్నమెంట్‌ ఉద్యోగం ఇప్పించాలని తండ్రి ప్రయత్నిస్తుంటాడు. లంచం ఇచ్చేందుకు కూడా సిద్ధపడి భార్య గాజులు అమ్మి డబ్బు తీసుకువస్తాడు. కానీ ఆ డబ్బు హీరో తన ఫ్రెండ్‌కు అవసరం ఉంటే ఇచ్చేస్తాడు.

ఈ విషయం ఇంట్లో తెలియడంతో హీరో తండ్రి నానా రచ్చ చేస్తాడు. మరోపక్క హీరోయిన్‌తో లవ్‌ట్రాక్‌ నడుపుతుండగానే ఆమె ప్రెగ్నెంట్‌ అవుతుంది. దీంతో హీరోయిన్‌కు అబార్షన్‌ చేయించేందుకు మళ్లీ డబ్బు అవసరం పడుతుంది. దీంతో డబ్బు కోసం హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు. చివరికి హీరోయిన్‌కు ఎలా అబార్షన్‌ చేయించాడు. హీరోకు తన ఫ్రెండ్స్‌ ఎలా హెల్ప్‌ చేశారు అనేది కథ. యాక్టింగ్‌ విషయంలో తిరువీర్‌ ఇరగదీశాడు. తెలంగాణ యాసలో యాక్టర్స్‌ చెప్పిన డైలాగ్స్‌కు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. అంతా కొత్తవాళ్లే అయినప్పటికీ క్యారెక్టర్స్‌లో జీవించారు.

నార్మల్‌గా అందరి జీవితాల్లో జరిగే సీన్స్‌నే సినిమాలో ఎక్కువగా పెట్టడంతో ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. స్క్రీన్‌ ప్లే పరంగా సినిమాకు కాస్త డ్యామేజ్‌ జరిగింది అని చెప్పొచ్చు. కథతో సంబంధం లేకుండా ఫన్‌ క్రియేట్‌ చేసేందుకు కొన్ని సీన్స్‌ పెట్టారు. ఇక తాగుడు సీన్స్‌ కూడా ఎక్కువగా ఉండటం కాస్తా ల్యాగ్‌గా అనిపించిది. తెలంగాణలో బాజ్‌ లేకుండా తిరిగే అబ్బాయిలు అంటే కేవలం తాగుడుకు బానిసలు అన్నట్టుగా చూపించడంపై కొందరు ఆడియన్స్‌ నెగటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ఈ రెండు మినహా సినిమాను ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు ఆడియన్స్‌. రెగ్యులర్‌ కమర్షియల్ బ్యారియర్స్‌ను పరేషాన్‌ సినిమా బ్రేక్‌ చేసింది. జాతిరత్నాలు సినిమా తరువాత మళ్లీ ఆ స్థాయిలో ఎండింగ్‌ వరకూ ఆడియన్స్‌ను నవ్వించింది. వీకెండ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి చూసేందుకు ఓ మంచి సినిమా పరేషాన్‌. మొత్తానికి మసూద తరువాత మరో హిట్‌ సినిమాతో ఆడియన్స్‌ను అలరించాడు తిరువీర్‌.