vijay devarakonda : రౌడీహీరో తీన్ మార్…
హిట్స్, ఫ్లాప్స్ తో ఏమాత్రం లేకుండా టాలీవుడ్ (Tollywood) లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) ఆశించిన విజయాన్నందించలేకపోయింది. అయినా.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు విజయ్.

Telangana superstar rowdy hero Teen Mar
హిట్స్, ఫ్లాప్స్ తో ఏమాత్రం లేకుండా టాలీవుడ్ (Tollywood) లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) ఆశించిన విజయాన్నందించలేకపోయింది. అయినా.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు విజయ్. మొదటిగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి తో సినిమాని పూర్తి చేయనున్నాడు. ఇప్పటికే పక్కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ వారంలోనే పట్టాలెక్కనుందట.
‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నాడు విజయ్. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్థన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అవుట్ అండ్ అవుట్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మార్క్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందట.
ఈ రెండు సినిమాలతో పాటు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లోనూ ఒక సినిమాని లైన్లో పెట్టాడు విజయ్. రాహుల్ సంకృత్యాన్ ఇప్పటికే విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (Taxiwala) సినిమా చేశాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singh Roy) మరో బడా హిట్ అందుకున్నాడు. 2021లో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండతోనే సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. వీరిద్దరి కాంబో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.