Samatha, Naga Chaitanya : చైతన్య జ్ఞాపకాలను తొలగించిన సమంత..
సీజన్ ఏదైనా మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ ఉంటే పెయిర్ సమంత, నాగచైతన్య. ఏ ముహూర్తాన విడాకులు తీసుకున్నారో కానీ.. వీళ్లిద్దరూ ఏం చేసినా ఇట్టే వైరల్ అయిపోతోంది. ఒకప్పుడు ప్రేమకు బ్రాండ్ అంబాసిడర్లు అన్నంత పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ జంట.. తరువాత అనుకోకుండా విడాకులు తీసుకున్నారు. నెమ్మదిగా ఒకరి జ్ఞాపకాలను ఒకరు చెరిపేస్తున్నారు. నాగచైతన్య భార్య గా ఉన్నప్పుడు సమంత ఒంటిపై మూడు టాటూలు ఉండేవి.

Telugu actor Chaitanya's ex-wife Samatha removed Naga Chaitanya's memories from her body
సీజన్ ఏదైనా మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ ఉంటే పెయిర్ సమంత, నాగచైతన్య. ఏ ముహూర్తాన విడాకులు తీసుకున్నారో కానీ.. వీళ్లిద్దరూ ఏం చేసినా ఇట్టే వైరల్ అయిపోతోంది. ఒకప్పుడు ప్రేమకు బ్రాండ్ అంబాసిడర్లు అన్నంత పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ జంట.. తరువాత అనుకోకుండా విడాకులు తీసుకున్నారు. నెమ్మదిగా ఒకరి జ్ఞాపకాలను ఒకరు చెరిపేస్తున్నారు. నాగచైతన్య భార్య గా ఉన్నప్పుడు సమంత ఒంటిపై మూడు టాటూలు ఉండేవి.
చైతన్యతో కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే అనే అర్థం వచ్చేలా YMC అక్షరాలతో టాటూ ఉండేది. అది కాకుండా మణికట్టుపై ఓ స్పెషల్ సింబల్ టాటూగా వేయించుకుంది. ఆ టాటూను డీకోడ్ చేస్తే సామ్‌చైతన్యల మ్యారేజ్ డేట్ వస్తుంది. ఈ రెండు టాటూలు కాకుండా సమంత రిబ్స్‌పై కూడా “చై” అని ఓ స్పెషల్ టాటూ ఉండేది. చాలా సందర్భాల్లో ఈ టాటూను పోజ్ చేస్తూ సమంత ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు సమంత ఒంటిపై ఆ టాటూ కనిపించడంలేదు. రీసెంట్‌గా దుబాయ్ వెళ్లిన సమంత.. అక్కడ ఓ ఈవెంట్‌కు హాజరయ్యింది. ఆ ఈవెంట్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఆ ఫొటోస్‌లో చై పేరుతో ఉన్న టాటూ కనిపించడంలేదు. దీంతో చైతన్య జ్ఞాపకాలను సమంత పూర్తిగా చెరిపేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో టాటూ కనిపించేలా సమంత చాలా పోస్ట్‌లు చేసింది. ఇప్పుడు టాటూ లేకుండా ఫొటోలు షేర్ చేసింది. చైతన్య జ్ఞాపకాలు కూడా ఇక తన జీవితంలో లేవు అని చెప్పేందుకే సమంత ఈ ఫొటోలు పోస్ట్ చేసింది అంటున్నారు ఫ్యాన్స్. అయితే మిగిలిన రెండు టాటూలు కూడా తొలగిస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి సమంత టాటూల వ్యవహారం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.