Payal Rajput: పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు కరువయ్యాయా..?

టాలీవుడ్‌లో పాయల్‌ రాజ్‌పుల్‌ పేరు వినిపించి చాలాకాలం అయింది. ఆర్ఎక్స్100 మూవీతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిన పాయల్‌.. అంతే వేగంతో పడిపోయింది. 'మంగళవారం' సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచింది. పాయల్‌కు క్రేజ్‌ తీసుకొచ్చిన ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్‌భూపతి డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2023 | 07:46 PMLast Updated on: Oct 08, 2023 | 7:46 PM

Telugu Actress Payal Rajput Is Getting Offers Or Not

Payal Rajput: ఓ హీరోయిన్‌ స్కిన్‌ షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్లామర్ ఇమేజ్‌తోనే నాలుగు ఆఫర్స్‌ దక్కాయి. బోల్డ్‌ ఇమేజ్‌ను కంటిన్యూ చేసినా.. సక్సెస్‌ మాత్రం మొహం చాటేసింది. మరోసారి కలిసొచ్చిన డైరెక్టర్‌నే నమ్ముకుంటూ గ్లామర్ షోతో వస్తోంది పాయల్ రాజ్‌పుత్. టాలీవుడ్‌లో పాయల్‌ రాజ్‌పుల్‌ పేరు వినిపించి చాలాకాలం అయింది. ఆర్ఎక్స్100 మూవీతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిన పాయల్‌.. అంతే వేగంతో పడిపోయింది. ‘మంగళవారం’ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచింది.

పాయల్‌కు క్రేజ్‌ తీసుకొచ్చిన ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్‌భూపతి డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. పాయల్ రాజ్‌పుత్‌ కెరీర్‌ ఒన్‌ మూవీ వండర్‌లా మారింది. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత ఎన్ని సినిమాలు చేసినా.. ఒక్కటీ సక్సెస్‌ కాలేదు. డిస్కోరాజా.. వెంకీమామలో రవితేజ, వెంకటేశ్‌ వంటి సీనియర్స్‌తో నటించినా.. అదృష్టం కలిసిరాలేదు. ఇన్ని ఫెయిల్యూర్స్‌ చూసిన హీరోలు.. దర్శకులు ఈ ఐరెన్‌ లెగ్‌ మాకొద్దంటూ పట్టించుకోవడం మానేశారు. మహాసముద్రం ఫ్లాప్‌ తర్వాత అజయ్‌భూపతి గ్యాప్‌ తీసుకుని మంగళవారం తీస్తున్నాడు.

తన తొలి సినిమాతో కలిసొచ్చిన హీరోయిన్‌కే ఛాన్స్‌ ఇచ్చాడు. హారర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. రొమాంటిక్‌ జానర్‌ కాకపోయినా.. ఆర్‌ఎక్స్‌ 100 స్టైల్లో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ పెట్టేశాడు దర్శకుడు. ఈ మెలోడీ సాంగ్‌ను ఈమధ్యే విడదల చేశారు.