Kalki Prabhas : కల్కి ఎవరో కాదు ప్రభాసే
కల్కి 2898 ఏడీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు.. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Telugu audience... especially Prabhas fans are waiting with a thousand eyes for the movie Kalki 2898 AD.
కల్కి 2898 ఏడీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు.. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తగ్గట్లుగానే కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ అంటూ ఇప్పటికే ఇన్ సైడ్ టాక్, సెన్సార్ రివ్యూలు వచ్చేశాయి. తాజాగా రిలీజ్ ట్రైలర్ కూడా వచ్చేసింది. సినిమా గురించి ఫ్యాన్స్ కి ఎలాంటి కంగారు లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యారు. కానీ, ఆ సినిమాలో కల్కి ప్రభాస్ కాదు అనే మాటను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కల్కి ప్రభాస్ కాకపోతే ఎలా అంటూ తెగ ఫీలైపోతున్నారు.
వైరల్ అవుతున్న ఆ కథనాల ప్రకారం భైరవ కల్కిగా మారతాడు. ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధమవుతాడు.అయితే దీపిక గర్భంలో ఉన్న బిడ్డకు ప్రమాదం జరగడంతో అశ్వత్థామ ఆ శక్తులను భైరవకు ట్రాన్స్ ఫర్ చేస్తాడు. అశ్వత్థామతోనే యుద్ధానికి దిగుతాడు. భైరవతో యుద్ధం చేసే సమయంలో అతని సత్తా ఏంటో అశ్వత్థామకు అర్థమవుతుంది. అక్కడితో మొదటి పార్ట్ ముగుస్తుంది
సినిమా రెండో భాగంలో కథ మరో స్థాయికి వెళ్లిపోతుంది. ఇదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల సారాశం. మొత్తానిక ప్రభాస్ ఫ్యాన్స్ డీలా పడకుండా ఉండేలా ఒక మంచి గాసిప్ అయితే వైరల్ అవుతోంది. ఇంత వరకు చాలా కన్విన్సింగ్ గానే ఉంది. అయితే కల్కి చనిపోతాడు అనేదే కాస్త స్వీకరించలేకుండా ఉంది. కల్కి ఆ మహావిష్ణువు పదో అవతారం అంటారు. అలాంటి అవతారాన్ని చనిపోయినట్లు చూపించడం అంటే పురాణాలను తప్పుబట్టడం అవుతుంది. అయితే అసలు కల్కి ఎవరో తెలియాలి అంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే మరి.