చెప్పుతో కొడతా, రజనీకాంత్ కు తెలుగు డైరెక్టర్ వార్నింగ్
కొందరు అగ్ర దర్శకులు సినిమాల విషయంలో పక్కాగా ఉంటారు. తమ సినిమా తాము అనుకున్న విధంగా వచ్చే వరకు తీవ్రంగా శ్రమిస్తారు. స్టార్ హీరోలతో చేసే సినిమాల కోసం ప్రాణం పెడతారు అనే మాట వాస్తవం.
కొందరు అగ్ర దర్శకులు సినిమాల విషయంలో పక్కాగా ఉంటారు. తమ సినిమా తాము అనుకున్న విధంగా వచ్చే వరకు తీవ్రంగా శ్రమిస్తారు. స్టార్ హీరోలతో చేసే సినిమాల కోసం ప్రాణం పెడతారు అనే మాట వాస్తవం. ఒక్కో సీన్ ను రాసుకునే సమయంలో ఎంతో మానసిక ఒత్తిడి అనుభవించి అది ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు. తాము అనుకున్న విధంగా ఆ షాట్ రాకపోతే దానిని పదే పదే రీ షూట్ కూడా చేస్తూ ఉంటారు. చిన్న తేడా జరిగినా సరే అంగీకరించరు.
అలాంటిది రజనీ కాంత్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా అంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మీరే ఊహించుకోండి. కాని ఒకసారి రజనీ అది లెక్క చేయకుండా ఆల్కాహాల్ తాగుతూ కూర్చోవడం స్టార్ డైరెక్టర్ బాల చందర్ గారికి ఆగ్రహం తెప్పించింది. అసలు ఏం జరిగింది అంటే… వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాను బాల చందర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు. ప్రతీ సీన్ ని పట్టి పట్టి చూస్తున్నారు. అలా ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత ఆయన అందరికి సాయంత్రం షూట్ అయిపోయింది ప్యాకప్ అని చెప్పారట.
దీనితో రజనీ కాంత్ వెంటనే వెళ్లి తాగుతూ కూర్చున్నారట. అప్పట్లో ఆయనకు తాగుడు అలవాటు బాగా ఉండేది. కాని అనుకోకుండా బాల చందర్ షూట్ అవ్వలేదు అని చెప్పారట. ఒక సీన్ తనకు మళ్ళీ రీ షూట్ కావాలని చెప్పడంతో… అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రజనీ కాంత్ ను పిలిచారట. మాములుగా వేరే డైరెక్టర్ అయితే రజనీ కాంత్ వెళ్ళేవారు కాదు. తనకు గురువు లాంటి బాలచందర్ పిలవడంతో స్నానం చేసి వెళ్ళిపోయారు రజనీ. అప్పుడు తాగిన విషయం బాల చందర్ కు అర్ధమై… నగేష్ అనే నటుడు ఉండేవాడు, నువ్వు ఆయన కాలిగోటికి కూడా సరిపోవు… ఇంకోసారి తాగి షూట్ కి వస్తే చెప్పుతో కొడతా అని ఆగ్రహంగా వార్నింగ్ ఇచ్చారట. ఆయన బాల చందర్ కాబట్టి రజనీ కాంత్ ఇక సైలెంట్ గా షూట్ నుంచి వెళ్ళిపోయి… వారి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చినా సరే తాగి మాత్రం రాలేదట.