ఛీ పెళ్లి వీడియో అమ్ముకుంటావా…? ఎవడికి కావాలి…? ధనుష్ కు టాలీవుడ్ సపోర్ట్

లేడీ సూపర్ స్టార్ నయనతార వర్సెస్ స్టార్ హీరో ధనుష్ వ్యవహారం ఇప్పుడు తెలుగులో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడో పదేళ్ళ క్రితం రిలీజ్ అయిన ఓ సినిమా గురించి ఇప్పుడు ఈ ఇద్దరూ రోడ్డు ఎక్కడం టాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2024 | 08:19 PMLast Updated on: Nov 20, 2024 | 8:19 PM

Telugu Fans Support For Danush

లేడీ సూపర్ స్టార్ నయనతార వర్సెస్ స్టార్ హీరో ధనుష్ వ్యవహారం ఇప్పుడు తెలుగులో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడో పదేళ్ళ క్రితం రిలీజ్ అయిన ఓ సినిమా గురించి ఇప్పుడు ఈ ఇద్దరూ రోడ్డు ఎక్కడం టాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతోంది. నానుం రౌడీ దాన్ అనే సినిమా షూటింగ్ సమయంలో… నయనతార యాక్టింగ్ ను ధనుష్ తప్పుబట్టడం, ఆ తర్వాత ఆమె యాక్టింగ్ కు అవార్డ్ రావడం… అలా వివాదం చినికి చినికి గాలి వానై తర్వాత కూల్ అయినట్టు కనిపించినా ఇప్పుడు మళ్ళీ నయనతార నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరితో పెద్దది అయింది.

ఆ డాక్యుమెంటరిలో నానుం రౌడీ దాన్ అనే సినిమాలో ఓ క్లిప్ వాడినందుకు ధనుష్ పది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపడంపై నయనతార ఫైర్ అయింది. దేవుడు చూస్తున్నాడు ధనుష్ అంటూ నాలుగు పేజీల బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖలో ఆమె తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా… ధనుష్ ఓ నీచుడు అంటూ ఆరోపించింది. సినిమా పరిశ్రమలో ఇలాంటి వ్యక్తులకు స్థానం లేదని, బహిరంగ వేదికలపై మాట్లాడే మాటలకు, చేసే పనులకు సంబంధం లేదని నయన్ ఆ లేఖలో ఫైర్ అయింది.

ఆమె లేఖ విడుదల చేసిన తర్వాత ఆమెది ఏం తప్పు లేదని కొందరు కామెంట్ చేసారు. కాని ఇప్పుడు మాత్రం అనూహ్యంగా ధనుష్ కు సపోర్ట్ వస్తోంది. సోషల్ మీడియాలో ధనుష్ తప్పేం లేదు అంటూ మన తెలుగులో కూడా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. నయనతార పెళ్లి వీడియోను పాతిక కోట్లకు నెట్ ఫ్లిక్స్ కు అమ్ముకున్నప్పుడు… ధనుష్ తన సినిమాలో ఓ క్లిప్ కు పది కోట్లు డిమాండ్ చేయడంలో తప్పేం ఉందని నిలదీస్తున్నారు. ఆమె అమ్ముకుంటే ఒప్పు ధనుష్ డిమాండ్ చేస్తే తప్పు ఎందుకు అవుతోంది అంటూ పలు మీమ్ పేజెస్ పోస్ట్ చేస్తున్నాయి.

అలాగే… నయనతార వెడ్డింగ్ వీడియోలు ఓ మూడు మిస్ అయ్యాయి అంటూ కొన్ని ఫొటోస్ ను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అప్పట్లో ఆమె శింబుతో ప్రేమ వ్యవహారం నడిపింది. అతన్ని పెళ్లి చేసుకుంటుంది అనే ప్రచారం జరిగింది. కాని అక్కడి నుంచి విడిపోయి తర్వాత… డాన్స్ మాస్టర్ ప్రభుదేవాకు దగ్గరైంది. అతని కోసం సినిమాలకు కూడా గుడ్ బై చెప్తుంది అనే ప్రచారం జరిగింది. కాని అతనికి కూడా గుడ్ బై చెప్పి… విజ్ఞేశ్ కు దగ్గరైంది. విజ్ఞేశ్ ను వివాహం చేసుకుని సరోగసి పద్దతిలో తల్లి అయింది. కాబట్టి… శింభు, ప్రభుదేవా వీడియోలు కూడా నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేయాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేసారు.