Telugu Film Industry: టాలీవుడ్‌కు హీరోలు కరువయ్యారా? కథలు ఉన్నా హీరోలు లేరే..

నార్త్‌ నుంచే ఉంటారు. ఇది ఇంత కాలం ఉన్న సిచ్యువేషన్‌. అయితే ఇప్పుడు హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా కరువయ్యారు. కథలు రెడీ ఉన్నా.. డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నా సినిమాలు చేసేందుకు హీరోలు మాత్రం లేరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2023 | 01:18 PMLast Updated on: May 25, 2023 | 1:18 PM

Telugu Film Industry Hero Scarecity

టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్స్‌ చాలా తక్కువ. ఉన్న కొంత మంది కూడా తెలుగు కంటే తమిళ్‌ మీద ఎక్కువ ఫోకస్‌ చేస్తారు. అందుకే తెలుగు సినిమాల్లో కనిపించే భామలంతా మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్లు కూడా హీరోల డేట్స్‌ లేక ఖాళీగా ఉంటున్నారు. ఉప్పెన లాంటి క్లాసిక్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ చిట్టిబాబు మొదటి సినిమాతోనే సూపర్‌ అనిపించాడు. తరువాతి ప్రాజెక్ట్‌ ఏకంగా గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ప్లాన్‌ చేశాడు.

కానీ ఇప్పటికే గేమ్‌ చేంజర్‌తో పాటు మరో సినిమా రెడీగా ఉండటంతో రెండేళ్లపాటు చరణ్‌ డేట్స్‌ లేవు. దీంతో చిట్టిబాబు వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉన్నాడు. సినిమా అనౌన్స్‌ చేసినా అది ఎప్పుడు సెట్స్‌కు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. ఇక కార్తికేయ2 లాంటి పాన్‌ ఇండియా హిట్‌ ఇచ్చిన చందు మొండేటి కూడా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌కు కొన్ని కథలు చెప్పాడట. కానీ వాళ్ల లైనప్‌ ఇప్పటికే బిజీగా ఉండటంతో సినిమా వర్కౌట్‌ కాలేదు.

ఇక దసరా లాంటి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ ఓదెల పరిస్థితి కూడా సేమ్‌. దసరా సినిమా ఇచ్చిన విజయంతో ఇండస్ట్రీ ఫోకస్‌ మొత్తం శ్రీకాంత్‌ మీదకి టర్న్‌ అయ్యింది. ఆయన నెక్స్ట్‌ సినిమా ఎవరితో చేస్తారనే టాక్‌ నడచింది. కథ రెడీగా ఉన్నా స్టార్‌ హీరోలు లేకపోవడంతో శ్రీకాంత్‌ కూడా ఇప్పుడు వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉన్నాడు. దీంతో తాను రాసుకున్న స్టోరీని అక్కినేని అఖిల్‌తో చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట శ్రీకాంత్‌. అఖిల్‌ కథ విన్నా.. వీళ్ల ప్రాజెక్ట్‌ గురించి ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

దీంతో యంగ్ డైరెక్టర్స్‌ సినిమాలు చేసేందుకు రెడీగానే ఉన్నా.. ఆ సినిమాల్లో నటించేందుకు హీరోలు మాత్రం ఖాళీగా లేని సిచ్యువేషన్‌ కనిపిస్తోంది. దీంతో టాలీవుడ్‌కు హీరోయిన్లు మాత్రమే కాదు.. హీరోల కొరత కూడా గట్టిగానే ఉందంటున్నారు క్రిటిక్స్‌.