కొరియాలో కో అంటే కోటి… జపాన్ లో ఎన్టీఆరే ఘనా పాటి…
బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. తర్వాత జర్మనీ, రష్యా , జపాన్ అంటూ తెలుగు సినిమా, విదేశాల్లో వెలిగింది. తర్వాత యూఎస్ లో ఇండియన్సే కాదు, అక్కడి లోకల్స్ కూడా మన సినిమాను చూసేలా త్రిబుల్ఆర్ ట్రెండ్ సెట్ చేసింది.
బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. తర్వాత జర్మనీ, రష్యా , జపాన్ అంటూ తెలుగు సినిమా, విదేశాల్లో వెలిగింది. తర్వాత యూఎస్ లో ఇండియన్సే కాదు, అక్కడి లోకల్స్ కూడా మన సినిమాను చూసేలా త్రిబుల్ఆర్ ట్రెండ్ సెట్ చేసింది. సలార్, కల్కీ, దేవర తో ఆసియా మొత్తంగా తెలుగు వెలుగులు పెరిగిపోయాయి. కాకపోతే ఇప్పుడు కొత్తగా కొరియా గోల పెరిగింది. యూఎస్ అయిపోయింది… ఆస్ట్రేలియా, కెనడాలో మనకి మార్కెట్ సెట్ అయ్యింది. ఇక జపాన్, జర్మనీ, రష్యా తర్వాత మిగిలింది కొరియానేనా? ఒకవైపు రష్యాలో ఇండియన్ సినిమాకు స్కోప్ పెంచామంటూ అక్కడి ప్రెసిడెంట్ పుతిన్ పిలుపిచ్చాడు. ఈలోపు కొరియా బోయ్స్ అండ్ గల్స్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ పాటకు డాన్స్ చేస్తూ, అక్కడ వీడియో ని వైరల్ చేశారు. మధ్యలో పుష్ప స్టార్ తో కొరియన్ లేడీస్ ఒక యాడ్ లో చిందేస్తే, ఎన్టీఆర్ కోసం ఎప్పటి నుంచో జపాన్ లో ఫ్యాన్స్ తన పాటలకి డాన్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇలా తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ ఆసియా, పాన్ వరల్డ్ అంటూ విస్తరిస్తోంది. కాని ఆసియాలోనే ముందు గట్టిగా పాగా వేసేందుకు సాలిడ్ ప్లానింగ్ జరుగుతున్నట్టుంది.
రీసెంట్ గా కొరియా పాప్ సింగర్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పాటకు డాన్స్ చేశారు. ఆవిడియో సోసల్ మీడియాలో వైరలైంది. కొరియన్ పాప్ సింగర్స్ ని ఫాలో అయ్యే ఇండియన్స్ , అదర్ ఏషియన్స్ కి గేమ్ ఛేంజర్ మూవీ రీచ్ అవుతోంది.. దాని అప్ డేట్స్ గూగుల్ లో వెతికారంటేనే, తెలుగు సినిమా ఆసియాలో పాపులర్ అవుతోందని తెలుస్తోంది.
ఇది ఒక్కరోజులో జరగలేదు. బాహుబలి, బాహుబలి 2 రెండు కూడా జపాన్, జర్మనీ, రష్యాని కుదిపేశాయి. జై లవకుశ కంటే ముందు నుంచే ఎన్టీఆర్ కి జపాన్ లో భారీ ఎత్తున ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. త్రిబుల్ ఆర్ పుణ్యామాని అక్కడ తారక్ అభిమానుల జోరు మరింత ఎక్కువైంది. ఫలితంగా తనకోసం ఇండియాక వచ్చి కలిసే జపనీస్ సంఖ్య కూడా పెరుగుతోంది
ప్రభాస్ కోసం కూడా చాలా మంది జపనీస్ హైద్రాబద్ లో తన ఇంటివరకు వచ్చి కలిసే ప్రయత్నం చేశారంటే, మన స్టార్లకు విదేశాల్లో పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ ఏంటో తెలిసిపోతోంది.. ఐతే జపాన్, చైనా, జర్మనీ పెద్ద మార్కెట్లే కాని, మన మూవీలను ఫ్రీక్వెంట్ గా చూస్తారా అంటే, కంటెంట్ కనెక్ట్ అయితే ఎంతసేపు…
కాబట్టి అది సమస్యే కాదు… రష్యన్ ప్రెసిడెంట్ అయితే ఇండియన్ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి, రష్యాలో ఇండియన్ మూవీస్ కి మరింత మంచిరోజులొచ్చినట్టే. ఆలెక్కన ఇండియన్ సినిమా అంటే తెలుగు మూవీనే అన్నట్టుగా సీన్ మారిపోయింది కాబట్టి, ఇక రష్యాలో కొత్త మార్కెట్ క్రియేట్ అయ్యేలా ఉంది
అమెరికా, ఆస్ట్రేలియా ఆఖరికి న్యూజిలాండ్ తోసహా బ్రిటన్ వరకు మన సినిమాలకు మార్కెట్ ఉంది. కారణం అక్కడ మన దేశస్తులు చాలా మంది సెటిలవ్వటం. ఆ రేంజ్ నుంచి అక్కడి లోకల్ సిటిజన్స్ వరకు మన సినిమాలు చూసే సంఖ్య పెరుగుతోంది. అంతవరకు బానే ఉంది. కాని కొరియా లాంటి చిన్న దేశం లో తెలుగు సినిమా వెలుగుతోందంటే అంతగా గర్వపడాలా? ఈ డౌటే చాలమందికొస్తుంది
కొరియా చిన్న దేశమే కావొచ్చు. కాని ప్రపంచ వ్యాప్తంగా వాల్ల సినిమాలతో, పాన్ కల్చర్ తో ఇన్ ప్లూయెన్స్ చేసే రేంజ్ లో ఉంది. కొరియన్ సింగర్స్ ఏదైనా కంటెంట్ ని ప్రమోట్ చేస్తే, అది వరల్డ్ వైడ్ గా ప్రమోట్ అయ్యే ఛాన్స్ఉంది. అందుకే ఆమధ్య పుష్ప హిట్ అయిన టైంలో బన్నీతో కొరియన్ పాప్ సింగర్స్ కలిసి యాడ్ చేస్తే, అదప్పట్లోవైరలైంది. సో ఎలా చూసినా పాన్ ఇండియా రేంజ్ నుంచి పాస్ ఆసియా వరకు తెలుగు సినిమా మార్కెట్ ని పెంచే పనిలో పడ్డట్టున్నారు మన ఫిల్మ్ మేకర్స్
పాన్ వరల్డ్ మార్కెట్లో పాతుకుపోవాలంటే పాన్ ఆసియా మార్కెట్ మీద పట్టు పెంచుకోవాలి. అందుకే గేమ్ ఛేంజర్ కి మరో కొత్త మార్కెట్ ని యాడ్ చేస్తోంది ఫిల్మ్ టీం. కొరియా నుంచి మంచి సపోర్ట్ దొరకుతోంది కాబట్టి, ఇదే అదనుగా, అక్కడ కూడా గేమ్ ఛేంజర్ ని రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.