Mogalirekulu Pavitranath passed away : తెలుగు బుల్లితెర.. మొగలిరేకులు సీరియల్ నటుడు మృతి..
మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. ఇలా ఎన్నో సీరియల్స్ తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కాగా నిన్న సాయంత్రం పవిత్రనాథ్ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి.

Telugu TV.. Mogalirekulu serial actor passed away..
తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. తెలుగు టెలివిజన్ లోని ఫేమస్ సీరియల్ మొగలిరేకులు ఫేమ్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ (Pavitranath) కన్నుమూశారు(passed away).
మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. ఇలా ఎన్నో సీరియల్స్ తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కాగా నిన్న సాయంత్రం పవిత్రనాథ్ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పటికి ఆయనకు ఏమీ కాలేదని, ఇదంతా అవాస్తవం అని సోషల్ మీడియాలో మళ్లీ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. ఇవాళ ఉదయం పవిత్రనాథ్ చనిపోయినట్లు ఇంద్రనీల్ భార్య మేఘన ఇస్టాలో పోస్ట్ చేశారు. దీంతో పవిత్రనాథ్ చనిపోయినట్లు ఈ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
మొగలి రేకులు సీరియల్లోని పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో కనిపించిన ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులను ఆకర్షించేయి. వారికి అభిమానులు కూడా ఉన్నారు. ఈ సీరియల్ లోని ముగ్గురు అన్నదమ్ములుగా కనిపించిన వీరిలో చిన్నవాడు దయ(పవిత్రనాథ్). కానీ సీరియల్ మధ్యలో దయ చనిపోవడంతో అతడి పాత్ర ముగిసింది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ చేసిన పవిత్రనాథ్.. చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇక పవిత్రనాథ్ చిన్న వయసులోనే మరణించడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. పవిత్రనాథ్ మరణించిన విషయాన్ని సీరియల్ నటుడు ఇంద్రనీల్, అతని భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.