Rajinikanth : తలైవా 171 టైటిల్ అనౌన్స్‌మెంట్…
సూపర్‌స్టార్ (Superstar) రజినీకాంత్ (Rajinikanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, ఆయన నడిస్తే స్టైల్, ఆయన తల విదిలిస్తే స్టైల్ అందుకే ఆయన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అయ్యారు.

Thalaiva 171 title announcement...
సూపర్‌స్టార్ (Superstar) రజినీకాంత్ (Rajinikanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, ఆయన నడిస్తే స్టైల్, ఆయన తల విదిలిస్తే స్టైల్ అందుకే ఆయన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తలైవా 171 చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇక లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) – రజినీకాంత్ (Rajinikanth) కలయికలో సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి రజనీ ఫ్యాన్స్‌లో ఒకరకమైన ఉత్సుకత ఉంది.తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్టేట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 22 సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రజనీ ఫ్యాన్స్ సంబరం చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో తలైవా 171 ను ట్రెండ్ చేస్తున్నారు. జైలర్ (Jailer) చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావడంతో అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కావడంతో ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం అవుతుంది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ లగ్జరీ వాచ్‌లు దొంగతనం చేసే క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు టాక్ నడుస్తుంది.