Thalapathy Vijay: విజయ్ సినిమాలకు గుడ్‌బై చెబితే చరణ్‌కి కలిసొచ్చిందా..?
లియో 2 భారీగానే ప్లాన్ చేశారు. లోకేష్ కనకరాజ్ కూడా కొంత కథ సిద్దం చేసుకున్నాడు. తీరా చూస్తే విజయ్ సినిమాలకు గుడ్ బై అంటే ఇక లియో 2 లేనట్టే అనుకోవాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు రామ్ చరణ్‌కి కలిసొస్తోంది.

Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి రాజకీయాల్లోకి వెళ్లటంతో అక్కడ సినిమా లెక్కలు మారిపోయాయి. తన చివరి సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని తేలింది. గోట్ మూవీ తర్వాత తను సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్టు తేలింది. అంతవరకు ఓకే విజయ్ ఇలా.. ఉన్నట్లుండి సినిమాలకు గుడ్ బై చెబితే, లియో సీక్వెల్ పరిస్తితేంటన్నారు.
MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ కోసం రంగంలోకి అతిలోక సుందరీమణులు?
నిజమే.. లియో 2 భారీగానే ప్లాన్ చేశారు. లోకేష్ కనకరాజ్ కూడా కొంత కథ సిద్దం చేసుకున్నాడు. తీరా చూస్తే విజయ్ సినిమాలకు గుడ్ బై అంటే ఇక లియో 2 లేనట్టే అనుకోవాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు రామ్ చరణ్‌కి కలిసొస్తోంది. ఎందుకంటే సూపర్ స్టార్ రజినీకాంత్‌తో లోకేష్ ప్లాన్ చేసిన మూవీ పూర్తి కాగానే లియో 2 అనుకున్నారు. కాని విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పటంతో ఇక లియో ఉండదు. దాని బదులు లోకేష్ ఖైదీ 2ని పట్టాలెక్కిస్తాడు ఖైదీ 2 మూవీ పూర్తయ్యే సమయానికి చరణ్‌తో బుచ్చి బాబు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
ఆ తర్వత లోకేష్ మేకింగ్‌లో చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి తమిళ విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పటంతో బుచ్చి బాబు సినిమా తర్వాత ఏం ప్లాన్ చేయాలా అని అనుకుంటున్న చరణ్‌కి లోకేష్ లాంటి మంచి ఆప్షన్ దొరికినట్టైంది.