Thalapathy Vijay: మహేశ్ బాబు హీరోయిన్లని టార్గెట్ చేసిన విజయ్ దళపతి..!
మీనాక్షి చౌదరి, శ్రీలీల ఇద్దరూ ఇప్పడు దళపతి విజయ్‌తో జోడీ కడుతున్నారు. అదే ఇప్పుడు అరవ అడ్డా నుంచి తెలుగు గడ్డ వరకు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పడే కాదు గతంలో కూడా మహేశ్ హీరోయిన్ల వెంటపడ్డాడు విజయ్.

Thalapathy Vijay: సూపర్ స్టార్ మహేశ్ ఎవరితో జోడీకడుతున్నాడా అని తమిళ హీరో విజయ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడా..? ఈ డౌట్ రావడానికి తను ఇప్పడు గుంటూరు కారం హీరోయిన్లని తన కొత్త మూవీలోకి తీసుకోవటమే కారణం. నిజమే.. మీనాక్షి చౌదరి, శ్రీలీల ఇద్దరూ ఇప్పడు దళపతి విజయ్‌తో జోడీ కడుతున్నారు. అదే ఇప్పుడు అరవ అడ్డా నుంచి తెలుగు గడ్డ వరకు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పడే కాదు గతంలో కూడా మహేశ్ హీరోయిన్ల వెంటపడ్డాడు విజయ్.
సూపర్ స్టార్ మూవీ మహర్షిలో పూజాహెగ్డే మెరిసిందో లేదో, వెంటనే తమిళ స్టార్ విజయ్ మూవీ బీస్ట్‌లో పూజా హెగ్డేకి ఛాన్స్ వచ్చింది. అలానే సరిలేరు నీకెవ్వరుతో మహేశ్ సరసన రష్మిక మెరిసిందోలేదో వెంటనే వారిసు అలియాస్ వారసుడులో విజయ్‌తో జోడీ కట్టేసింది రష్మిక మందన్న. ఇలా అనుకోకుండా జరిగిందిలే అనుకుందామా అంటే, సరే ఒక హీరోయిన్‌ని తీసుకున్నాడు కాబట్టి ఉన్నవాళ్లతోనే సరిపెట్టుకోవాలి కాబట్టి ఇలా జరిగిందనుకోవచ్చు.
మరి గుంటూరు కారంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఇద్దరిలో ఎవరో ఒకర్ని విజయ్ దళపతి సినిమాకు తీసుకోవచ్చు కదా.. అలా కాకుండా శ్రీలీల, మీనాక్షి చౌదరి.. ఇలా ఇద్దరినీ తీసుకోవటం బట్టి చూస్తే అదేంటో లింకు లేకుండా, కారణం లేకుండా మహేశ్ హీరోయిన్ల మీదే విజయ్ ఫోకస్ పెంచటం ఆలోచనలకు అందట్లేదు.