Thalapathy Vijay: 250 కోట్లా.. అయినా ప్రభాస్‌ని మించలేదా..?
అక్షయ్, హృతిక్ అయితే 125 కోట్ల పారితోషికంతో సరిపెట్టుకుంటున్నారు. టాలీవుడ్ మహేశ్ బాబు 100 కోట్ల రెమ్యూనరేషన్‌కి ప్రాఫిట్స్‌లో షేర్ కలిపితే 150 కోట్లని లెక్కలు తేలుతున్నాయి. పవన్‌కి కూడా రెమ్యునరేషన్, ప్రాఫిట్స్‌లో షేర్ కలిపి 150 కోట్ల వరకు దక్కుతున్నాయట.
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తన 69వ మూవీకి రూ.250 కోట్లు తీసుకుంటున్నాడట. జాకీ చాన్ నుంచి రజినీకాంత్ వరకు ఎవరికీ అంత పారితోషికం లేదు. బాలీవుడ్‌లో ఖాన్‌లు అందరూ 120 కోట్ల నుంచి 150 కోట్ల రెమ్యునరేషనే తీసుకుంటున్నారు. అక్షయ్, హృతిక్ అయితే 125 కోట్ల పారితోషికంతో సరిపెట్టుకుంటున్నారు. టాలీవుడ్ మహేశ్ బాబు 100 కోట్ల రెమ్యూనరేషన్‌కి ప్రాఫిట్స్‌లో షేర్ కలిపితే 150 కోట్లని లెక్కలు తేలుతున్నాయి.
PAWAN KALYAN: పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ప్రచారం ఆగిపోయినట్లేనా..?
పవన్‌కి కూడా రెమ్యునరేషన్, ప్రాఫిట్స్‌లో షేర్ కలిపి 150 కోట్ల వరకు దక్కుతున్నాయట. అలాంటిది ఓ తమిళ స్టార్ దళపతి విజయ్ ఒక్క మూవీకి రూ.250 కోట్లు తీసుకోవటం నిజంగా రికార్డే. మరి పాన్ ఇండియా మార్కెట్‌ని షేక్ చేసే ప్రభాస్ పరిస్థితేంటంటే.. తన రేంజే వేరు. బాహుబలికి రూ.100 కోట్లు, సాహోకి రూ.150 కోట్లు, రాధేశ్యామ్, ఆదిపురుష్‌కి దాదాపు రూ.160కోట్లు తీసుకున్నాడు. కల్కికి కూడా ఏరియా రైట్స్‌తోపాటు తన రెమ్యునరేషన్ కలిపితే రూ.200 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక సలార్ 2, హనురాఘవ పూడి మూవీ, స్పిరిట్‌కి ఏరియా రైట్స్‌తో తన పారితోషికం కలిపితే రూ.300 కోట్ల వరకు అందేలా ఉందట.
కాబట్టి, ఎలా చూసినా ఇండియాలోనే రూ.300 కోట్ల రెమ్యునరేషన్‌తో హాలీవుడ్ స్టార్స్ రేంజ్‌కు చేరుకున్నాడు ప్రభాస్. అలా చూస్తే తమిళ స్టార్ విజయ్ ఇంకా 50 కోట్ల వరకు వెనకబడ్డాడు. కాకపోతే రెబల్ స్టార్ రెమ్యునరేషన్ మీద పెద్దగా ప్రచారాల్లేవు. తమిళ్ దళపతి విజయ్ పారితోషికం మీద అక్కడ మీడియ ఇస్తున్న హైప్‌కి అందరి అటెన్షన్ అటువైపు మళ్ళుతున్నట్టుంది అంతే.