Thalapathy Vijay: చిరు, పవన్ దారిలోనే దళపతి విజయ్ ?
అచ్చంగా పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి రూట్లోనే ఈ హీరో నడవబోతున్నాడు. అంటే రాజకీయాల్లోకి వచ్చేందుకు, పార్టీ పెట్టేందుకు సిద్దమౌతున్నాడు. ఆల్రెడీ ఆ పనుల మొదలయ్యాయట.

Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్.. వచ్చే ఏడాది తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ప్రజెంట్ వెంకట ప్రభు మేకింగ్‌లో గోట్.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ లియో 2 చేస్తాడట. 2025 వరకు సినిమాలు చేసి, 2026 నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడట. అచ్చంగా పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి రూట్లోనే ఈ హీరో నడవబోతున్నాడు.
Jr NTR-RAM CHARAN: రాజమౌళి ఈ ఇద్దరికీ హిట్ ఇచ్చినా ఫేట్ మాత్రం డౌట్‌లోనే..?
అంటే రాజకీయాల్లోకి వచ్చేందుకు, పార్టీ పెట్టేందుకు సిద్దమౌతున్నాడు. ఆల్రెడీ ఆ పనుల మొదలయ్యాయట. అయితే చిరులానే సినిమాలకు పూర్తిగా దూరమై, రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దపడ్డ విజయ్, మధ్యమధ్యలో మాత్రం ఒకటి అర సినిమాలు చేస్తాడని తెలుస్తోంది. అచ్చంగా పవన్ కళ్యాణ్‌లానే విజయ్ కూడా రాజకీయాలు, సినిమాలు అంటూ ప్యారలల్ జర్నీ చేస్తాడనే టాక్ కూడా పెరిగింది. ఇలాగే రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని బాబా మూవీ టైంలో అనుకున్నాడు. కుదర్లేదు.
పేట మూవీ టైంలో అనుకున్నాడు. అడుగు వేయబోయాడు. హెల్త్ ఇష్యూవల్ల వెనకడుగు వేయాల్సి వచ్చింది. మరి చిరు, పవన్, రజినీకాంత్ ఈ ముగ్గురిలో ఎవరి స్ట్రాటజీని తమిళ స్టార్ విజయ్ అప్లై చేస్తాడో తేలాలంటే ఏడాది ఆగాల్సిందే.