LEO TRAILER: లియో మూవీ ట్రైలర్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!
నిజానికి లియో ప్రోమో చూసిన ఎవరికైనా ఏంటీ గందరగోళం అనే అభిప్రాయమే కలుగుతుంది. అలా కట్ చేశారు. ఏముందిరా అనిపించే సింగిల్ సీన్ లేకుండా ట్రైలర్ వదలటంతోనేకాదు మరో కారణంతో కూడా లియో మీద ట్రోలింగ్ పెరిగింది.

LEO TRAILER: లియో ట్రైలర్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్. అంతటికి రెండు కారణాలు. ఒకటి పరమ చెత్త ట్రైలర్ కట్ అంటూ ఎడిటర్‌ని తిట్టిపోస్తున్నారు. ఉప్పులేని పప్పుకూడులా ఈ ట్రలైర్ ఉందంటున్నారు. నిజానికి లియో ప్రోమో చూసిన ఎవరికైనా ఏంటీ గందరగోళం అనే అభిప్రాయమే కలుగుతుంది.
అలా కట్ చేశారు. ఏముందిరా అనిపించే సింగిల్ సీన్ లేకుండా ట్రైలర్ వదలటంతోనేకాదు మరో కారణంతో కూడా లియో మీద ట్రోలింగ్ పెరిగింది. అదే కాపీ కథ అన్న కామెంట్. హాలీవుడ్ లో ఎన్నడో వచ్చిన హిస్టరీ ఆఫ్ వయోలెన్స్ మూవీకి లియో ఫ్రీమేక్ అనుకోవాల్సి వస్తోంది. ట్రైలర్ చూశాకే అంతా ఓ క్లారిటీకి వచ్చారు. ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ మూవీలో ఓ గ్యాంగ్ స్టర్ ని పోలి ఉన్న హీరోని మిస్ అండర్ స్టాండ్ చేసుకుని వేటాడుతారు విలన్స్.. గత్యంతరం లేక తను కూడా గ్యాంగ్ స్టర్‌గా మారి ఫైట్ చేయాల్సి వస్తుంది. ఈ కథతో జమనాలో వచ్చిన హాలీవుడ్ మూవీ ఎ హిస్టరీ ఆఫ్ వయోలెన్స్ మూవీని లియో రూపంలో లోకేష్ రీమేక్ చేస్తున్నాడన్నారు.
తీరా చూస్తే ఎక్కడా రీమేక్ ఎనౌన్స్ మెంట్ లేదు. సరే కథ వేరు కావొచ్చనుకుంటే, అచ్చంగా అలాంటి కథేమో అనేలా ట్రైలర్ తో తేలింది. అందుకే ఖైదీ, విక్రమ్ తో వచ్చిన పేరుని లోకేష్ కనకరాజ్, లియో కాపీ కథతో పోగొట్టుకునేలా ఉన్నాడంటూ కామెంట్లు, ట్రోలింగ్స్ పెంచారు.