పుష్ప టీంపై తమన్ సీరియస్… టైం వేస్ట్ అంటూ ఫైర్
నేషనల్ వైడ్ గా కాదు వరల్డ్ వైడ్ గా పుష్ప సినిమా కోసం సినిమా పిచ్చోళ్ళు యమాగా ఎదురు చూస్తున్నారు. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే ఊగిపోతున్నారు ఇప్పుడు. సినిమా కోసం అల్లు అర్జున్ 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు.
నేషనల్ వైడ్ గా కాదు వరల్డ్ వైడ్ గా పుష్ప సినిమా కోసం సినిమా పిచ్చోళ్ళు యమాగా ఎదురు చూస్తున్నారు. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే ఊగిపోతున్నారు ఇప్పుడు. సినిమా కోసం అల్లు అర్జున్ 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. సుకుమార్ ఏకంగా ఆరేళ్ళ పైనుంచి కష్టపడుతున్నాడు. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం ఈ సినిమా షూట్ ను కంప్లీట్ చేసి గుమ్మడి కాయ కొట్టారు మేకర్స్. ఓ వైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగంగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మూడు ఈవెంట్ లు నిర్వహించ్చారు.
ఈ మూడు ఈవెంట్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను టార్గెట్ చేసిన వాళ్లకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తామని వెయిట్ చేయమని పుష్ప మేకర్స్, బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక నార్త్ తో పాటుగా సౌత్ లో మిగిలిన స్టేట్స్ లో కూడా సినిమాకు మార్కెట్ పెంచాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు. అందుకే ఇప్పుడు సౌత్ లో అన్ని రాష్ట్రాల్లో ఈవెంట్స్ చేస్తున్నారు. ముంబైలో కూడా ఓ ఈవెంట్ ప్లాన్ చేసారు. ముంబైలో కాస్త సౌత్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ముంబై ఎక్కువ ఫోకస్ చేసారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా యూనిట్ లో కొన్ని సమస్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అసలు ఏం జరిగిందో తెలియదు గాని… రోజుకో రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సరిగా ఇవ్వలేదు అనే కారణంతో… అతని ప్లేస్ లో తమన్ ను తీసుకున్నారు. తమన్ వేరే సినిమాలను పక్కన పెట్టి ఈ సినిమా కోసం వర్క్ చేసాడు. భారీ ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నా సరే పుష్ప కోసం 15 రోజుల టైం కేటాయించాడు.
కాని చివరకు అసలు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ను మేకర్స్ వాడలేదు. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ తోనే సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ లో కూడా అసలు తమన్ మ్యూజిక్ వాడలేదు. దీనితో తమన్ సీరియస్ అయ్యాడు. తనకు టైం వేస్ట్ అంటూ మేకర్స్ పై ఫైర్ అయ్యాడట. మైత్రీ మూవీ మేకర్స్ తో తమన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతోనే నేరుగా చెప్పాడట ఈ విషయం. తాను బిజీగా ఉన్నా సరే మీ రిక్వస్ట్ తో వర్క్ చేసాను అని… ఇప్పుడు తన మ్యూజిక్ వాడకపోవడం వెనుక అర్ధం ఏంటి అని ఫైర్ అయ్యాడట.