Nithin : ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ‘తమ్ముడు’
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి పెద్ద అభిమాని అయిన నితిన్.. ఇప్పుడు అతని సూపర్ హిట్ టైటిల్ ను వాడుకుంటూ చేస్తోన్న సినిమా ‘తమ్ముడు’ (Tammudu). ‘ఎమ్.సి.ఎ (MCA), వకీల్ సాబ్’ (Vakil Saab) ఫేమ్ శ్రీరామ్ (Sriram Venu) వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

'Thammudu' with intense action sequences
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి పెద్ద అభిమాని అయిన నితిన్.. ఇప్పుడు అతని సూపర్ హిట్ టైటిల్ ను వాడుకుంటూ చేస్తోన్న సినిమా ‘తమ్ముడు’ (Tammudu). ‘ఎమ్.సి.ఎ (MCA), వకీల్ సాబ్’ (Vakil Saab) ఫేమ్ శ్రీరామ్ (Sriram Venu) వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ‘తమ్ముడు’ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది.
మీడియం రేంజ్ హీరోస్ లో ముందు వరుసలో నిలిచే నితిన్ ఈ సినిమాలో చేసే హై వోల్టేజ్ యాక్షన్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుందట. అలాగే.. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ గురించి పెడుతోన్న బడ్జెట్ చిత్రవర్గాల్లో చర్చకు కారణమైంది. ఆమధ్య ‘తమ్ముడు’ కోసం షూట్ చేసిన యాక్షన్ పార్ట్ కి ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు అయ్యిందనే ప్రచారం జరిగింది. లేటెస్ట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఓ భారీ సెట్ లో మరో యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారట. కాంతార’ (Kantara) ఫేమ్ విక్రమ్ మోర్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తోన్న ఈ యాక్షన్ సీన్ కూడా సినిమాకి హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, ‘కాంతార’ ఫేమ సప్తమి గౌడ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతోనే రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నితిన్ కి అక్క పాత్రలో కనిపించనుందట లయ.