Keedaa Cola: కీడాకోలా సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అంత తక్కువా..?

తక్కువ రన్‌టైమే అయినా.. చిన్న చిత్రాలకు ఇది మంచి సానుకూల అంశంగా మారుతుంది. ఇటీవల కొన్ని చిత్రాలకు ఎక్కువ నిడివి ఉండటం మైనస్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 31, 2023 | 07:37 PMLast Updated on: Oct 31, 2023 | 7:37 PM

Tharun Bhasckers Keedaa Cola Censor Completed Run Time Is

Keedaa Cola: యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం కీడా కోలా. నవంబర్ , శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కూడా పూర్తైంది. చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అయితే, ఈ సెన్సార్ సర్టిఫికేషన్ ద్వారా కీడా కోలా మూవీ రన్ టైమ్ కూడా వెల్లడైంది. ఈ సినిమా 120 నిమిషాలు నిడివితో రానుంది.

అంటే 2 గంటలు మాత్రమే. ఇది కాస్త తక్కువ రన్‌టైమే అయినా.. చిన్న చిత్రాలకు ఇది మంచి సానుకూల అంశంగా మారుతుంది. ఇటీవల కొన్ని చిత్రాలకు ఎక్కువ నిడివి ఉండటం మైనస్‌గా మారింది. అయితే, కీడా కోలాకు తక్కువ నిడివి కలిసొస్తుందని అంచనా. చైతన్య రావ్ హీరోగా రూపొందిన కీడా కోలా మూవీని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా సమర్పిస్తున్నారు. రానా ఈ చిత్ర ప్రమోషన్లలోనూ పాలు పంచుకుంటున్నారు. జీ సైన్మా పతాకం ఈ చిత్రాన్ని నిర్మించారు.

కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాలో చాలా కాలం తర్వాత బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విష్ణు ఓయ్, రఘురామ్, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.