sharwanand : శ‌ర్వానంద్ తండ్రిగా ఆ యాంగ్రీ హీరో

టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో (Young Hero) ల్లో శ‌ర్వానంద్ (Sharwanand) రూటే సెప‌రేట్‌.. టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యువ న‌టుడు. త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌ర‌చుకున్నాడు.. ఈ మ‌ధ్య కాలంలో కాస్త ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన స్టైల్‌లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2024 | 12:10 PMLast Updated on: Feb 28, 2024 | 12:10 PM

That Angry Hero As Sharwanands Father

టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో (Young Hero) ల్లో శ‌ర్వానంద్ (Sharwanand) రూటే సెప‌రేట్‌.. టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యువ న‌టుడు. త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌ర‌చుకున్నాడు.. ఈ మ‌ధ్య కాలంలో కాస్త ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన స్టైల్‌లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర్వా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి మనమే అన్న టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ నుండి అతి త్వరలో అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి. అయితే.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

యూనీక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ ఫామిలీ డ్రామా మూవీలో.. తండ్రి పాత్ర‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంద‌ట‌.. అయితే.. ఈ క్యారెక్ట‌ర్‌లో ఓ ప్ర‌ముఖ హీరో క‌నిపించ‌బోతున్నార‌న్నది లేటెస్ట్ బ‌జ్.. శ‌ర్వానంద్ తండ్రి పాత్ర‌లో యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించ‌నున్నార‌న్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇటీవల నితిన్ హీరోగా రూపొందిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లో ఒక కీలక పాత్ర చేసి అందరినీ అలరించారు రాజశేఖర్.. ఇప్పుడు శ‌ర్వానంద మూవీలో చేయ‌బోయే పాత్రలో రాజశేఖర్ ది రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్ర అని అంటున్నారు. దీంతో.. ఈ న్యూస్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ మార్చి 2 తో కంప్లీట్ కానుంది. నెక్ట్స్ షెడ్యూల్ ని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లో ప్రారంభించనున్నారట.. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాపై పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ భారీగా ఖ‌ర్చు పెడుతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే రూ.50 కోట్ల బ‌డ్జెట్ దాటేసింద‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక దీనితో పాటు లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డితో కూడా ఓ సినిమా చేస్తున్నారు శర్వానంద్. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.