Dj tillu : ఆ బ్యూటీ క్యామియో అపియరెన్స్ పక్కా అట..!

డీజే టిల్లు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ను డబుల్ చేయాలని చూస్తున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. అంతకు ముందు నాలుగు ఐదు సినిమాలు చేసినప్పటికీ రాని క్రేజ్‌ను డీజే టిల్లు మూవీ తీసుకొచ్చింది. ఆ ఒక్క సినిమా సిద్దును స్టార్ బాయ్ గా మార్చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2024 | 11:29 AMLast Updated on: Feb 26, 2024 | 11:29 AM

That Beauty Cameo Appearance Is Perfect

డీజే టిల్లు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ను డబుల్ చేయాలని చూస్తున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. అంతకు ముందు నాలుగు ఐదు సినిమాలు చేసినప్పటికీ రాని క్రేజ్‌ను డీజే టిల్లు మూవీ తీసుకొచ్చింది. ఆ ఒక్క సినిమా సిద్దును స్టార్ బాయ్ గా మార్చేసింది. ఆ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటూ.. ఇప్పుడు డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు సిద్ధూ.. టిల్లు స్క్వేర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్’ లో యంగ్ బ్యూటీ క్యామియో అపియరెన్స్ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది.

టిల్లు స్క్వేర్ మూవీ ద్వారా సిద్దూ మరోసారి యూత్‌ను ఆకట్టుకే కథతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై యూత్‌లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అనుపమ గ్లామర్ గేట్లు ఎత్తేసిందని.. ట్రైలర్ లోనే ఓ డీప్ లీప్ కిస్ సీన్ తో అభిమానులు షాక్ అయ్యేలా చేసింది. ఈ మూవీలో గ్లామర్ షోతో అనుపమ కుర్రాళ్లకు పిచ్చెక్కించడం ఖాయమన్న టాక్ వినిస్తోంంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని.. ఈ అమ్మడు చిన్న క్యామియో ఇస్తుందని టాక్ వినిపిస్తోంది.

టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ నేహా శెట్టి కూడా కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. డీజే టిల్లు సినిమాలో రాధికాగా తన నటనతో అందంతో కట్టిపడేసిన నేహా శెట్టి ఇప్పుడు టిల్లు స్క్వేర్ లోనూ కనిపించనుందట. ఈ సీక్వెల్ లో కొన్ని నిమిషాల పాటు నేహా క్యామియో పాత్రలో కనిపించనుందని.. సీన్స్ ఆడియన్స్ ని ఎంతో ఎంటెర్టైన్ చేస్తాయని టాలీవుడ్‌లో లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలటే మార్చ్ 29న మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే..