Pushpa2 : ‘పుష్ప 2’ టీజర్ లో మెయిన్ హైలైట్ అదే

పుష్ప మూవీతో రికార్డ్స్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఈసారి పుష్పగాడి రూల్‏తో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 (Pushpa 2) టీజర్ ( Teaser) పై అంతకంతకు హైప్ పెరుగుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2024 | 11:54 AMLast Updated on: Apr 08, 2024 | 11:54 AM

That Is The Main Highlight In Pushpa 2 Teaser

 

 

 

పుష్ప మూవీతో రికార్డ్స్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఈసారి పుష్పగాడి రూల్‏తో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 (Pushpa 2) టీజర్ ( Teaser) పై అంతకంతకు హైప్ పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న బన్నీ అభిమానుల ముందుకు మరికాసేపట్లో టీజర్ రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక లుక్.. ఫహాద్ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.ఈ క్రమంలోనే అభిమానులకు బన్నీ బర్త్ డే స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. పుష్ప 2 మూవీ నుంచి వరుస అప్డేట్స్ రివీల్ చేస్తూ సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఈరోజు పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule Teaser ) టీజర్ రిలీజ్ చేయనున్నారు. కాగా.. టీజర్‌లో బన్నీ గెటప్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.

ఇక నిన్న పుష్ప 2 టీజర్ పై అప్డేట్ ఇస్తూ మేకర్స్ రివీల్ చేసిన బన్నీ పోస్టర్ అదిరిపోయింది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ఈరోజు ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బన్నీ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో సింహాసనంలో బన్నీ కుర్చొని ఉండగా.. కుడి చేతిలో గొడ్డలి పట్టుకుని కుర్చున్న విధానం చూస్తే ఈసారి మరింత మాస్ యాక్షన్‏తో రఫ్పాడించేందుకు బన్నీ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఊర మాస్ లుక్‌లో పుష్ప రాజ్ (Pushpa Raj) ను చూసిన ఫ్యాన్స్‌ పూనకాలుతో ఊగిపోయారు.

మరోవైపు సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ హడావిడి మొదలైంది. బన్నీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ తమ అభిమాన హీరో రేర్ ఫోటోస్ పోస్ట్ చేస్తున్నారు. అలాగే పుష్పరాజ్ పోస్టర్స్‏ను తమదైన స్టైల్లో ఎడిటింగ్ చేసిన పోస్టులు ఆకట్టుకుంటున్నాయి. కాగా.. టీజర్ లో బన్నీ ఓల్డ్ గెటప్ ఓ రేంజ్ లో ఉంటుందట. అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో కనిపిస్తారని.. బన్నీ గెటపే ఈ చిత్రానికి భారీ బజ్‌ని సృష్టిస్తోందని.. టీజర్ లో మెయిన్ హైలైట్ కూడా బన్నీ గెటపే అన్న టాక్‌ ఫ్యాన్స్‌ను కుదురుగా ఉండనీయడం లేదు.. కాగా ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయన్న టాక్ వినిపిస్తోంది.. అందుకే, ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మరి కొద్దిసేపట్లో సోషల్ మీడియాలో పుష్పగాడి ఊచకోత ఖాయమంటున్నారు ఫ్యాన్స్