తమిళ స్టార్ హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయనకు ఏం జరిగిందో అర్థం కాక సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు నమ్మాలో లేదో తెలియక జనాల్లో కూడా ఒక రకమైన సస్పెన్స్ ఉంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన విశాల్ ఆరోగ్య పరిస్థితి చూసి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. మనిషికి కావాల్సింది డబ్బు కాదని ఆరోగ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమిళ సినిమా పరిశ్రమ కూడా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టింది. ఆయనకు అవసరమైన సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ తమిళ సినిమా పరిశ్రమ పెద్దలు ఇప్పటికే ప్రకటనలు కూడా చేశారు. 2011లో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన విశాల్ ఆ తర్వాత నుంచి అనారోగ్యానికి గురవుతూ వస్తున్నాడని... ఆ గాయం ఇప్పుడు మళ్లీ తిరగబెట్టింది అనే వార్తలు కూడా వస్తున్నాయి. కంటి నుంచి మెదడుని కలిపే ఒక నరం దెబ్బతిన్నదని... దాని కారణంగానే విశాల్ కు ఈ పరిస్థితి అంటూ కొంతమంది కామెంట్ చేశారు. ఇక తాజాగా తమిళ సీనియర్ నటి కుష్బూ దీనిపై కీలక ప్రకటన చేశారు. అసలు విశాల్ కు ఏం జరిగిందో ఆమె ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. విశాల్ కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచారని... కానీ మదగజరాజు సినిమా 11 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుందని... ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్ కు విశాల్ వచ్చినట్లు ఆమె బయటపెట్టారు. ఆ రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాడని... జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగినట్టు ఆమె వివరించింది. 11 నెల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుందని... దీనికి కచ్చితంగా రావాలనుకున్నానని చెప్పారని తెలిపారు కుష్బూ. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారని... ఈవెంట్ పూర్తి కాగానే మేము విశాల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లామని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు కోలుకుంటున్నారని అసలు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. కొంతమంది యూట్యూబ్ వ్యూస్ కోసం విశాల్ గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని... సెలబ్రిటీల విషయంలో నిజా నిజాలు తెలుసుకోకుండా తేలికగా గాసిప్స్ రాసేస్తున్నారని ఆమె ఫైరయ్యారు. 2013 లోనే మదగజరాజు సినిమా షూటింగ్ పూర్తయింది... కానీ 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుందని అన్నారు. ఈ సినిమాకు సుందర్ డైరెక్షన్ వహించగా అంజలి, వరలక్ష్మి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. ప్రస్తుతం విశాల్ చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మరో వారం పది రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉందని కుష్బూ బయటపెట్టారు.[embed]https://www.youtube.com/watch?v=SJJnEDG536c[/embed]