అక్కడున్నది బాలకృష్ణ.. కాస్త చూసుకుంటే నీకే మంచిదేమో పవన్.. ఫ్యాన్స్ వార్నింగ్..!

ఓ పద్ధతి ఓ విజన్ ఓ ప్లానింగ్.. బాలయ్య సినిమా చేసేటప్పుడు ఇవన్నీ బాగా కనిపిస్తాయి మనకు. అందుకే 64 ఏళ్ళ వయసులో కూడా ఆరు నెలలకు ఒక సినిమా చేస్తున్నాడు ఈయన.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 05:30 PMLast Updated on: Mar 20, 2025 | 5:30 PM

Thats Balakrishna If You Look A Little Closer It Might Be Good For You Pawan Fans Warning

ఓ పద్ధతి ఓ విజన్ ఓ ప్లానింగ్.. బాలయ్య సినిమా చేసేటప్పుడు ఇవన్నీ బాగా కనిపిస్తాయి మనకు. అందుకే 64 ఏళ్ళ వయసులో కూడా ఆరు నెలలకు ఒక సినిమా చేస్తున్నాడు ఈయన. బాలయ్యతో సినిమా కమిట్ అయ్యాడు అంటే ఆ నిర్మాత నిశ్చింతగా నిద్రపోతాడు. చెప్పిన టైంకు షూటింగ్ కు వస్తాడు.. ఎంత బిజీగా ఉన్నా ఒప్పుకున్న సినిమా టైంకు పూర్తి చేస్తాడు.. అలా ఉంటుంది బాలయ్యతో కమిట్మెంట్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అఖండ 2 కూడా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. దీనికి తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. బాలయ్య కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే. బోయపాటి ఉన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అని బయ్యర్లు కూడా భయపడకుండా ముందడుగు వేస్తున్నారు. బాలయ్య సినిమాకు పోటీగా అదే రోజు సెప్టెంబర్ 25న సాయి ధరంతేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా కూడా విడుదల కానుంది. దీని బడ్జెట్ కూడా 120 కోట్లకు పైగానే ఉంది. కొత్త దర్శకుడు రోహిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

హనుమాన్ లాంటి సంచలన సినిమా నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంబరాల ఏటిగట్టు సినిమాను నిర్మిస్తుంది. బాలయ్యతో సాయి ధరం తేజ్ పోటీ పడగలడా అనే డిబేట్ చాలా రోజులుగా జరుగుతుంది. కాకపోతే ఈ రెండు డిఫరెంట్ జూనియర్ కథలు కావడంతో కచ్చితంగా దసరా వీకెండ్ కలిసొస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.. ఇప్పుడు కొత్త స్టోరీ స్టార్ట్ అయింది. దాని పేరు ఓజి.. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ లాస్ట్ వీక్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు పవన్. దాంతో సినిమాను వేగంగా పూర్తి చేసి సెప్టెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా దసరాకు అయితే బాగా వర్కవుట్ అవుతుందని నిర్మాత డివివి దానయ్య అలా ప్లాస్ చేస్తున్నాడు. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమా వస్తే మాత్రం ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు.

ఎందుకంటే ఓజిపై ఉన్న అంచనాలు నెవెర్ బిఫోర్. దాదాపు 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ సినిమా ఇది. మధ్యలో అన్ని రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు ఈయన. అజ్ఞాతవాసి స్ట్రైట్ సినిమా అయినా కూడా దాన్ని త్వరగానే మరిచిపోయారు ఫ్యాన్స్. ఎందుకంటే గురూజీ ఆ సినిమాను అలా తీశాడు కాబట్టి. అందుకే ఓజి అనౌన్స్ అయిన రోజు నుంచి దాని మీదే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అందుకే చెప్తున్నది దీన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదనీ..! పవన్ సినిమా వస్తే రేసు నుంచి కచ్చితంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన సినిమాను వెనక్కి తీసుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ అసలు పోటీ మాత్రం బాలయ్యతోనే ఉంటుంది. అఖండ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ఏమాత్రం తక్కువగా అంచనా వేసిన.. ఓజిని సైతం మడత పెడుతుంది. ఎందుకంటే బాలయ్య ఉన్న ఫామ్ అలా ఉంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల ముందు ఒకటే ఆప్షన్ ఉంది.. ఒక మూడు నాలుగు రోజుల గ్యాప్ తీసుకుని రెండు సినిమాలు విడుదల చేయడం ఒక్కటే దీనికి పరిష్కారం. అలా కాదని ఒకేరోజు వస్తే మాత్రం కచ్చితంగా కలెక్షన్స్ పై చాలా ప్రభావం పడుతుంది. మరి చూడాలి నిర్మాతలు ఎలా ప్లాన్ చేస్తారో..!