కీర్తి పెళ్లి చీర స్పెషాలిటీ అదే, పాప టేస్ట్ అదుర్స్ అంటున్న అమ్మాయిలు
ఏదేమైనా సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఏం చేసినా సరే స్పెషల్ గానే ఉంటుంది. వాళ్లకు మీడియా ఇచ్చే హైప్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్ల పెళ్లిళ్లు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లు జరిగితే దాని గురించి మీడియాలో పెద్దపెద్ద చర్చలు చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా దానికి మంచి క్రేజ్ ఉంటుంది.
ఏదేమైనా సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఏం చేసినా సరే స్పెషల్ గానే ఉంటుంది. వాళ్లకు మీడియా ఇచ్చే హైప్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్ల పెళ్లిళ్లు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లు జరిగితే దాని గురించి మీడియాలో పెద్దపెద్ద చర్చలు చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా దానికి మంచి క్రేజ్ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మొన్నటి వరకు శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య అక్కినేని వివాహం గురించి సోషల్ మీడియాలో రీల్స్ వైరల్ కాగా ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
తాజాగా ఆమె పెళ్ళిలో ధరించిన చీర గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నెల 12న గోవాలో కీర్తి సురేష్ చాలా గ్రాండ్ గా వివాహం చేసుకుంది. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఆదివారం క్రైస్తవ సాంప్రదాయంలో కూడా ఆమె వివాహం జరిగింది. భర్త కోసం క్రైస్తవ సాంప్రదాయంలో కీర్తి వివాహం చేసుకుంది. ఇక ఈ పెళ్ళిలో ఆమె చీరకు చాలా స్పెషాలిటీ ఉంది. కీర్తి సురేశ్ పెళ్లి చీర ఆర్ట్ అలాగే చీర తయారీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, పాటించిన సంప్రదాయాలు చూసి ఆ చీరను అద్భుత కళాఖండంగా చెప్తున్నారు.
వ్యాపారవేత్త ఆంథోనీ తటిల్ ను వివాహం చేసుకున్న కీర్తి… ఈ పెళ్ళిలో అనితా డోంగ్రే రూపొందించిన ప్రముఖ చేనేత కంజీవరం చీరను ధరించింది. దక్షిణ భారత సంస్కృతి, చీరపై వర్క్ అన్నీ కూడా చాలా బాగా ఫేమస్ అయ్యాయి. ఈ పట్టు చీరను తయారు చేయడానికి ఏకంగా… 405 గంటలు పట్టింది. ఈ చీర తమిళనాడు, కేరళలో బాగా ఫేమస్ అయిన సాంప్రదాయ కోర్వాయి నేతతో తయారు చేయడమే చీరను హైలెట్ చేసింది. పసుపు, ఆకుపచ్చ రంగులతో ఈ చీర చాలా అద్భుతంగా ఉంది. బంగారు జరీతో ఈ చీర మెరిసిపోయింది.
కొంతమంది అయితే కీర్తి కంటే చీర బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు చీర ఖర్చు 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుందట. ఈ చీరపై కీర్తి రాసిన పద్యం కూడా పొందుపరచడం గమనార్హం. ఆకుపచ్చ బ్లౌజ్ తో చీరకుమంచి అందం వచ్చింది. ఇక కీర్తి జడ కూడా బాగా వైరల్ అవుతోంది. ఆండాల్ కోడై, నేతి చుట్టి, సూర్యపిరై, చంద్రపిరై, సువాసనలు వెదజల్లే మొగ్రా పూలతో ఆమె జడను అలంకరించారు. ఈ చీర కోసం అసలు ఎక్కడా మెషిన్స్ వాడలేదు. మరి కీర్తి అంటే మినిమం ఉంటుంది.