Manchi manasu : డేనియల్ బాలాజీ అందుకే పెళ్లి చేసుకోలేదా..
ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ మృతితో చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.. అయితే.. డేనియల్ వివాహ జీవితంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.
ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ మృతితో చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.. అయితే.. డేనియల్ వివాహ జీవితంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.. ఆయన పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్న దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. డేనియల్ వివాహంపై క్లారిటీ లేదు.. అయితే ఆయన గత ఇంటర్వ్యూల్లో వివాహ జీవితానికి దూరంగా ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. 48 ఏళ్లు పూర్తి అయినా కూడా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదని పలు ప్రశ్నలు నెట్టింట కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన సంపాధించిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలుసా అంటూ పలురకాలుగా ప్రచారం జరుగుతుంది. .
డేనియల్ కుటుంబం పెద్దదే. ఐదుగురు సోదరులతో పాటు.. ఐదుగురు సోదరీమణులు కూడా ఉన్నారు. కానీ డేనియల్ బాలాజీ మాత్రం వివాహానికి దూరంగా ఉన్నాడు. తనకు 25 ఎళ్ల వయసు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోనని తన తల్లికి చెప్పాడట డేనియల్.. తన కుటుంబంలోని సభ్యులందరికీ పెళ్లిళ్లు అయ్యాక వారు పడిన ఇబ్బందులు చూసి పెళ్లి వద్దనుకున్నట్లు తన తల్లితో చెప్పినట్లు డేనియల్ ఇంటర్వ్యూల్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడట.. పెళ్లి తర్వాత, భార్యా, పిల్లలు వంటి బాధ్యతలు తన వల్ల కాదని తెలిపాడట. అందుకోసం ఒక్కోసారి తప్పులు కూడా చేయాల్సి వస్తుంది. కొందరిని మోసం చేయాల్సి వస్తుంది.. ఇలా పలు కారణాలతో పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్లు ఇంటర్వ్యూల్లో తెలిపాడట.
డేనియల్ చెన్నైలో కొట్టివాక్కం ప్రాంతంలో ఉండేవాడు. తాను సంపాదించిన అక్కడ ఓ గుడి కోసం ఖర్చు చేసారుట. ఆ గుడి కి వచ్చే భక్తులతో పాటు… తన తల్లి కూడా తరుచూ అదే గుడికి వెళ్లడంతో పాడు బడిన ఆ గుడి నిర్మాణం కోసం తన సంపాదనలో చాలా సొమ్మును ఆ గుడి కోసం ఖర్చు చేసారట. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ గుడిని ఎవరూ అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ఉన్న అమ్మవారిని నమ్మిన వారు కోట్లలో సంపాదించారు. కానీ వారెవరూ గుడి కోసం ఖర్చు పెట్టలేదు. అలాంటి సమయంలోనే ఈ గుడి కోసం ఎదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో డేనియల్ చెప్పాడట..
ఆలయ నిర్మాణ కోసం డేనియల్ సుమారు 3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కోలీవుడ్‌లో పలు వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఇక యశ్‌కు, డేనియల్‌కు మధ్య మంచి స్నేహం ఉందట. ఆ కారణంగా.. కేజీఎఫ్ లో నటించమని యశ్ స్వయంగా ఫోన్ చేసి అడిగాడుట.. అయితే.. ఆ గుడి పనుల్లో ఉండే కేజీఎఫ్ సినిమాలో ఛాన్స్ కూడా వదులుకున్నట్లు డేనియల్ గతంలో తెలిపాడు. ఈ విషయం యశ్ కి తెలిసి తానే స్వయంగా గుడి పూర్తయిన తర్వాత వెళ్లి వచ్చాడుట.. మొత్తానికి డేనియల్ మృతి తర్వాత ఆయన చేసిన మంచి పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. సమాజం కోసం పాటు పడిన మంచి మనిషి అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.