అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి అభ్యంకర్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచే ట్రెండింగ్ కూడా మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2025 | 05:20 PMLast Updated on: Apr 09, 2025 | 5:20 PM

The 20 Year Old Boy Who Is Composing Music For Allu Arjuns Film Who Is Sai Abhyankar

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచే ట్రెండింగ్ కూడా మొదలైంది. అయితే అల్లు అర్జున్, అట్లీ సినిమా కోసం మొత్తం అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. కానీ ఒక్కడి పేరు మాత్రం చాలా కొత్తగా ఉంది.. అతడే సాయి అభ్యంకర్. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అతని పేరు ప్రకటించలేదు.. కానీ AA 22 సినిమాకు సంగీతం అందించేది అతనే. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని 20 ఏళ్ల కుర్రాడికి.. ఏకంగా 600 కోట్ల సినిమా ఎలా ఇచ్చారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. దాంతో అసలు ఎవరు ఈ కుర్రాడు.. ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ఆయన గురించి బాగా ఆరా తీస్తున్నారు. కానీ మనోడి బ్యాగ్రౌండ్ తెలిస్తే.. ఇంత పెద్ద ఛాన్స్ ఇవ్వడంలో పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలోనే సాయి అభ్యంకర్ జన్మించాడు. అతని తండ్రి ఎవరో కాదు ఫేమస్ సింగర్ టిప్పు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు.

తెలుగులో కూడా ఒకప్పుడు టిప్పు పాడిన పాటలు చాలావరకు సూపర్ సక్సెస్ అయ్యాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’లో ‘ఉన్నమాట చెప్పనీవు…’ నుంచి మొదలు పెడితే ‘చిరుత’లో ‘యమహా యమ్మ’, ‘జులాయి’లో ‘చక్కని బైక్ ఉంది’ వరకు ఇలా ఎన్నో పాటలు పాడాడు టిప్పు. ఇక సాయి అభ్యంకర్ తల్లి పేరు హరిణి. ఆమె కూడా పాపులర్ సింగర్. టిప్పు కంటే ఎక్కువ తెలుగు పాటలు పాడారు. ఏఆర్ రెహమాన్, మణిశర్మ, హ్యారీస్ జయరాజ్ నుంచి మొదలుపెట్టి.. నేటి దేవి శ్రీ ప్రసాద్, తమన్, జీవీ ప్రకాష్, మిక్కీ జే మేయర్ వరకు ఎంతో మంది సంగీత దర్శకులతో కలిసి పని చేసింది హరిణి. టిప్పు, హరిణి దంపతుల కుమారుడు సాయి అభ్యంకర్. సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. చేసిన ఒక్క సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. కానీ కానీ ఆ సినిమా కోసం సాయి కంపోజ్ చేసిన పాటలు సంచలనం రేపాయి. 2024లో విడుదలైన ‘కట్చి సేరి’ పాటతో సాయి అభ్యంకర్ తన స్వరంతో పాటు సంగీతాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ సాంగ్ 220 మిలియన్ వ్యూస్ సాధించింది.

ఆ తర్వాత మరో సాంగ్ ఆశ కూడా చేశారు. అది 245 మిలియన్ వ్యూస్ కొట్టింది. మీనాక్షి చౌదరి నటించిన మ్యూజిక్ సింగిల్ ‘సితిరా పుతిరి’కి కూడా సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడు. ఇప్పటి వరకు సాయి అభ్యంకర్ పని చేసిన మ్యూజికల్ సింగిల్స్ చార్ట్ బస్టర్స్. పాటల వరకు ఓకే గాని బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మనోడిని నమ్మి ఇవ్వొచ్చా అనే అనుమానాలు ఉన్నాయి. వాటికి కూడా సమాధానాలు ఇచ్చాడు సాయి. అనిరుధ్ రవిచందర్ దగ్గర దేవర, కూలీ లాంటి సినిమాలకు పని చేశాడు. ఇప్పుడు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ మొదటి తెలుగు సినిమా అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్టు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాఘవ లారెన్స్ హీరోగా భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న ‘బెంజ్’తో పాటు.. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న సినిమా, ప్రదీప్ రంగనాథన్ – మమితా బైజు జంటగా నటిస్తున్న సినిమాలకు కూడా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అచ్చం 14 ఏళ్ల కింద అనిరుద్ ఎలాగైతే 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాడో.. ఇప్పుడు సాయి అభ్యంకర్ కూడా 20 ఏళ్ల వయసులోనే వస్తున్నాడు. మరి ఈ కుర్రాడు ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడో చూడాలి.