OG First single : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది
ఇప్పటికే రిలీజ్ అయిన ఓజి గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హంగ్రీ చీతా బిట్ ట్యూన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

The already released OG Glimpses has brought joy to Pawan fans.
ఇప్పటికే రిలీజ్ అయిన ఓజి గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హంగ్రీ చీతా బిట్ ట్యూన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. గ్లింప్స్‌కే ఇలా ఉంటే.. ఓజి నుంచి హంగ్రీ చీతా లాంటి సాంగ్ వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓజి మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నప్పటికీ.. అనుకున్న సమయానికే రిలీజ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓజి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ మధ్య పుష్ప2, దేవర నుంచి ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అవగా ఫ్యాన్స్ పండగ చేసకుంటున్నారు. ఇదే సమయంలో ఓజి సాంగ్ కూడా వస్తే వేరే లెవెల్లో ఉంటుంది.. అని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.అందుకే.. పవన్ ఫ్యాన్స్‌లో జోష్ నింపడానికి ఓజి మొదటి పాటను విడుదల చేయడానికి రెడీ అవున్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాని ప్రకారం జూన్ 4న ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే, ఓజి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే తమన్ హై ఓల్టేజ్ ట్యూన్ రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ మధ్య అప్టేట్స్ కాస్త తగ్గించిన డివివి ఎంటర్టైన్మెంట్స్.. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఫస్ట్ సాంగ్‌తో పాటు వీలైనంత త్వరగా ఓజి షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. జస్ట్ 15 నుంచి 20 రోజులు డేట్స్ ఇస్తే పవన్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కానుంది. కాబట్టి.. త్వరలోనే ఓజి ఫస్ట్ సింగిల్ రావడం పక్కా అంటున్నారు.