Sankranti movies : మహేష్ ‘ఆ కుర్చీని మడత పెట్టి..’
డిసెంబర్ సినిమాల సందడి పూర్తయిపోయింది. ఇక అందరి దృష్టీ సంక్రాంతిపై పడింది. సినిమా లవర్స్ సంక్రాంతి అంటే పెద్ద పండగ అనే చెప్పాలి. ఎందుకంటే టాప్ హీరోల సినిమాలు ఎక్కువగా సంక్రాంతికే రిలీజ్ అవుతుంటాయి.

The buzz of December movies is over. All eyes were on Sankranti. Sankranti is a big festival for movie lovers
డిసెంబర్ సినిమాల సందడి పూర్తయిపోయింది. ఇక అందరి దృష్టీ సంక్రాంతిపై పడింది. సినిమా లవర్స్ సంక్రాంతి అంటే పెద్ద పండగ అనే చెప్పాలి. ఎందుకంటే టాప్ హీరోల సినిమాలు ఎక్కువగా సంక్రాంతికే రిలీజ్ అవుతుంటాయి. అలా సూపర్ స్టార్ మహేష్ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయి పెద్ద హిట్ అయ్యాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో మంట పుట్టించడానికి వస్తున్నా మహేష్. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మహేష్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటూ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాలోని ఓ పాట మంచి ట్రెండిరగ్‌లోకి వచ్చింది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి విడుదలైన స్టిల్స్ ఎంతో ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరోయిన్ శ్రీలీల గురించి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.. డాన్స్ ఇరగదీస్తుందని, దానికి మహేష్ కూడా తోడైతే ఆ కాంబినేషన్‌లో రూపొందిన పాట ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ ప్రోమోలో పాటకు సంబంధించిన చిన్న ముక్క మాత్రమే చూపించారు. అది కూడా ఎంతో జోష్‌తో ఉంది.
‘ఆ కుర్చీని మడత పెట్టి..’ అని మహేష్ అనడం.. వెంటనే ఫాస్ట్ బీట్‌తో వచ్చే పాటకు మహేష్, శ్రీలీల వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. అంత చిన్న బిట్‌లోనే డాన్స్ ఇరగదీశారు అనిపిస్తోంది. ఇక ఫుల్ పాట ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోమో సినిమాకి హండ్రెడ్ ప్లస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. న్యూఇయర్ కానుక గా పాటను రిలీజ్ చేస్తున్నారు. మరీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.