లెక్క మారింది, ముంబై… హైదరాబాద్ లో దిగుతోంది…?
ఒకప్పుడు సౌత్ సినిమా అంటే బాలీవుడ్ కు చిన్న చూపు. బాలీవుడ్ సినిమాలే సినిమాలు ఇండియాలో మరో సినిమా లేదు రాదూ, వచ్చినా ఆడదు అంటూ కథలు పోయారు బాలీవుడ్ హీరోలు నిర్మాతలు. ఇక్కడి హీరోలను అసలు కనీసం మనుషుల్లా కూడా చూసేవారు కాదు అక్కడి జనాలు.
ఒకప్పుడు సౌత్ సినిమా అంటే బాలీవుడ్ కు చిన్న చూపు. బాలీవుడ్ సినిమాలే సినిమాలు ఇండియాలో మరో సినిమా లేదు రాదూ, వచ్చినా ఆడదు అంటూ కథలు పోయారు బాలీవుడ్ హీరోలు నిర్మాతలు. ఇక్కడి హీరోలను అసలు కనీసం మనుషుల్లా కూడా చూసేవారు కాదు అక్కడి జనాలు. సాధారణంగా సౌత్ విషయంలో కాస్త వివక్ష ఉంటుంది. అది సినిమాల్లో కూడా చూపించేవారు అనే టాక్ వచ్చేది. వంద కోట్లు వచ్చేసరికి అక్కడి జనాలకు ఎక్కడా ఆగలేదు. స్టార్ హీరోలు చిన్న హీరోలు అందరూ వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు.
హిందీ మాట్లాడే రాష్ట్రాలు 5, హిందీ తరహాలో అంటే మరాఠి, గుజరాతి, పంజాబీ, రాజస్థాని ఇలా కొన్ని భాషలను కూడా హిందీలో కలుపుకుని హిందీ బెల్ట్ గా చెప్పుకుని సినిమాలను ఆడించే వాళ్ళు. మరాఠి రాష్ట్రంలో మహారాష్ట్రలో బాలీవుడ్ హవా కొనసాగింది. దానితో పాటుగా ముందు చెప్పిన రాష్ట్రాల్లో కూడా బాలీవుడ్ డామినేషన్ నడిచింది. కాని ఇప్పుడు లెక్క మారింది. ఇండియన్ సినిమాలో సౌత్ సినిమా పాగా వేస్తోంది. తెలుగు సినిమా దున్నుకుంటూ పోతోంది. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా తెలుగు హీరోలు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు.
బాలీవుడ్ కు ఇప్పుడు సౌత్ తప్పించి దిక్కు లేకుండా పోయింది. ఎంత సేపు అక్కడి మూస కథలతో జెర్కిన్ తో ట్రైన్ ఆపడం, ట్రక్కుల మీద బండి తోలడం లాంటి సీన్స్ నే తిప్పి తిప్పి చూపిస్తున్నారు అక్కడి డైరెక్టర్లు. వినూత్నంగా సినిమా చేసి ప్రేక్షకులకు అందించే ఆలోచన ఎప్పుడో చచ్చిపోయింది బాలీవుడ్ లో. తెలుగులో గొడ్డలి వాడినా, ఎద్దులు వాడినా ఓ లెక్క ఉంటుంది. అందుకే అఖండ హిందీలో కూడా షేక్ ఆడించింది. ఇప్పుడు బాలీవుడ్ బ్రతకాలంటే తెలుగు లేదా ఇతర సౌత్ భాషల నటులు, దర్శకులే దిక్కు అయ్యారు.
అందుకే… సినిమా చేస్తాం ప్లీజ్ అంటూ కథలు తీసుకు రండి అంటూ అడుగుతున్నారు మన దర్శకులను. వంశీ పైడపల్లి చెప్పిన కథ అమీర్ కు నచ్చిందట. ఇక సురేందర్ రెడ్డి కూడా ఓ కథ రాసుకుని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో దిగడానికి రెడీ అవుతున్నాడు. ఇక తమ సినిమాల్లో ఓ విలన్ రోల్ లేదంటే సెకండ్ హీరో రోల్స్ చేయాలి ప్లీజ్ అంటూ అడుగుతున్నారు ముంబై సినిమా వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 లో అలాగే నటిస్తున్నాడు. ఇక త్వరలోనే ప్రభాస్ ను కూడా తన సినిమాలో తీసుకోవాలని ఓ బాలీవుడ్ స్టార్ హీరో… ఓ నిర్మాతతో రాయబారం పంపుతున్నాడు. రాజమౌళితో తర్వాతి సినిమా చేయాలని అక్కడి స్టార్ హీరో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఇలా ముంబై ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అవుతూ సందడి చేస్తోంది… కాదు చేయాలనుకుంటోంది.