BIGG BOSS : రసపట్టు.. బాల్ పట్టు.. అమర్ రతిక శివాజీ గౌతమ్ మధ్య డైలాగ్ వార్
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ మంచి రసపట్టులో కొనసాగుతోంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం జరుగుతున్న ఎంపిక లెవల్ జరుగుతుంది. వీరసింహాలు వర్సెస్ గర్జించే పులుల మధ్య టఫ్ ఫైట్ నెక్స్ట్ లెవల్ జరుగుతుంది. పైగా పోటీదారులుగా నిలిచేందుకు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో వీర సింహలు.. పై చేయి సాదించగా.. పల్లవి ప్రశాంత్.. డెడ్ బోర్డు ట్యాగ్ మెడలో వేసుకునే ఇంట్లో తిరుగుతూ కనిపించారు.

The captaincy task in the Bigg Boss house is going on well. The selection level for the captaincy contenders is held
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ మంచి రసపట్టులో కొనసాగుతోంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం జరుగుతున్న ఎంపిక లెవల్ జరుగుతుంది. వీరసింహాలు వర్సెస్ గర్జించే పులుల మధ్య టఫ్ ఫైట్ నెక్స్ట్ లెవల్ జరుగుతుంది. పైగా పోటీదారులుగా నిలిచేందుకు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో వీర సింహలు.. పై చేయి సాదించగా.. పల్లవి ప్రశాంత్.. డెడ్ బోర్డు ట్యాగ్ మెడలో వేసుకునే ఇంట్లో తిరుగుతూ కనిపించారు. గురువారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఓ వైపు ఆట మరో వైపు రొమాంటిక్ ముచ్చట్లను పరిచయం చేశాడు బిగ్ బాస్.
వీర సింహాలు, గర్జించే పులులు రెండు జట్లు గట్టిగానే పోటీపడ్డాయి. హాల్ ఆఫ్ బాల్ టాస్కు లో భాగంగా బాల్స్ ను పట్టుకునేందుకు పోటీపడ్డారు. వీలైనన్ని ఎక్కువ బంతులను సేకరించడానికి రెండు జట్లు ప్రయత్నించడంతో పాటు ప్రత్యర్థుల నుంచి కాపాడుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. ఆట మొదలు పెట్టే ముందు బిగ్ బాస్ రెండుటీంలకు సంచులను పంపించాడు. అయితే.. అమర్ గౌతమ్ తెచ్చుకునేందుకు పోటీపడ్డారు. సంచుల విషయంలో రతిక అమర్ మధ్య జరిగిన డైలాగ్ వార్ పర్సనల్ వరకు వెళ్లింది. అనంతరం బిగ్ బాస్ ‘బ్రేక్ ఇట్ ఎయిమ్ ‘ టాస్క్ ఇచ్చాడు. ఇందులో గర్జించే పులులు నుంచి అర్జున్, అమర్.. వీర సింహాలు నుండి శోభా, గౌతమ్ ఈ గేమ్ ఆడారు. ఈ ఆటలో అమర్ అద్భుతంగా ఆడి గెలుపు సాధించడంతో బిగ్ బాస్ ఓ పవర్ ఇచ్చాడు. ఆ పవర్ తో ప్రత్యర్థి టీం నుంచి ఒకరిని డెడ్ చేయడం లేదా.. వారి నుండి 500 బాల్స్ తీసుకోవచ్చని సూచించాడు. దీంతో గర్జించే పులులు టీమ్ 500 బాల్స్ తీసుకునే ఆప్షన్ ఎంచుకున్నారు. అనంతరం మరలా పై నుండి బాల్స్ పడ్డాయి. కంటెస్టెంట్స్ సేకరించేందుకు పోటీపడ్డారు. కట్ చేస్తే.. గోల్డెన్ బాల్స్ కలిగి ఉన్న టీంకు బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు.
గోల్డెన్ బాల్ ఎవరి వద్ద ఉందని బిగ్ బాస్ అడిగా.. వీర సింహాలు టీమ్ తమ దగ్గర ఉందని చెప్పారు. దీంతో గోల్డెన్ బాల్ ఉన్న టీం ఆపోజిట్ టీమ్ నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ ను తమ టీంలో ఉన్న వీక్ ప్లేయర్ మార్చుకునేఅవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్ దీంతో.. గౌతమ్.. వీక్ అయిన బోలే ను అర్జున్ తో స్వాప్ చేసుకున్నాడు. దీంతో అసలైన ఆట మొదలైంది. రాత్రివేళ గర్జించే పులుల బాల్స్ ను దొంగలించేందుకు ప్రయత్నించగా.. శివాజీ-గౌతమ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక ఓవైపు టాస్క్ జరుగుతుండగానే… బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త లవ్ ట్రాక్ మొదలైనట్లు చూపించారు. అశ్విని-గౌతమ్ మధ్య పెళ్లి ముచ్చట్లు వచ్చాయి. అంతేకాక యావర్ అశ్విని మధ్య లవ్ ట్రాక్ మొదలైనట్లు చూపించారు. మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ రంజుగా సాగింది.