ఇండియానా జోన్స్ లోని పాత్రే.. 12000 కోట్ల డౌట్ క్లియర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీలో మెరుస్తోన్న లేడీ ప్రియాంక చోప్రా. మొన్నటి వరకు మూడు షెడ్యూల్స్ షూటింగ్ తర్వాత యూఎస్ కి వెళ్లిన తను, మళ్లీ వచ్చింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీలో మెరుస్తోన్న లేడీ ప్రియాంక చోప్రా. మొన్నటి వరకు మూడు షెడ్యూల్స్ షూటింగ్ తర్వాత యూఎస్ కి వెళ్లిన తను, మళ్లీ వచ్చింది. హైద్రబాద్ లో ల్యాండ్ అయ్యింది. అంతవరకు ఓకే కాని, గతంలో తన పాత్ర మీద వినిపించిన రూమర్లే నిజమైనట్టు కొత్తగా కన్ఫామ్ అవుతోంది. బేసిగ్గా మహేశ్ బాబు పాత్రని హనుమంతుడు, అలానే మహాభారతంలోని బార్బారికుడి పాత్రలని కలిపి డిజైన్ చేసిన రాజమౌలి, ప్రియాంక పాత్రని మాత్రం పూర్తిగా హాలీవుడ్ సినిమాలోంచే తీసుకుంటున్నాడట. మొన్నటి వరకు హీరో ప్రేయసిగా ప్రియాంక చోప్రా కనిపిస్తుందని, లేదంటే నెగెటీవ్ రోల్ వేస్తోందని అన్నారు. కాని అందులో సగమే నిజమని సమాచారం అందుతోంది. నెగెటీవ్ రోల్ వేయటమే కాదు, అచ్చుగుద్దినట్టు హీలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ లోని ఒక పాత్ర ప్రేరణగా తన పాత్ర ఉండబోతోంది. అదేదో కాపీ కొట్టి తీయటం కాదు, రైట్స్ కొనుక్కొనే ఆపాత్రని తీసుకున్నారట. ఇంతకి ఆపాత్రేంటి? రైట్స్ కొనుక్కకునీ మరి ఎందుకు ఆ పాత్రని తీసుకున్నారు..? హావేలుక్
హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా హైద్రబాద్ లో ల్యాండవ్వగానే, ఎస్ ఎస్ ఎంబీ 29 కోసమే వచ్చిందన్నారు. నిజమే తను వచ్చింది కూడా నాలుగో షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ అవ్వటానికే. అయితే కొత్త డెవలప్ మెంట్ ఏంటంటే, ఇందులో తన పాత్ర క్లియర్ కట్ గా రివీల్ అయ్యింది. ఇక మీదట ఎన్ని నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్లు పెట్టినా ప్రయోజనం ఉండేలా లేదు.ఏది బయటికి లీక్ కాకూడదని నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ పెట్టారు కాని, అన్నీ లీకౌతూనే ఉన్నాయి. ప్రజెంట్ లీకౌతున్న సమాచారం చూస్తుంటే, కావాలనే బయటికి లీకులందిస్తున్నారేమో అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు షూటింగ్ మొదలైందే ఎవరికి తెలియకుండా చేసి, ఇప్పుడు 22న ప్రెస్ మీట్ పెట్టి కుండబద్దలుకొట్టాలనుకున్నాడు రాజమౌళి.
నిజానికి శాటర్ డేనే ఏప్రిల్ 22 న జరిగే ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ గురించి అప్ డేట్ రావాలి. అలా జరక్కుండా నాలుగో షెడ్యూల్ షూటింగ్ మొదలవ్వటంతో, ఈప్రెస్ మీట్ ని వాయిదా వేశారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. సో ప్రెస్ మీట్ లో మీడియాకి కాన్సెప్ట్ ని మరిన్ని డిటేల్స్ నిచెప్పాల్సిన రాజమౌళి, ఇలా బయటికి లీకులతో వదులుతున్నాడనే కామెంట్లు పెరిగాయి.
ఇక ప్రియాంక చోప్రా పాత్ర తాలూకు లీకుల సంగతి చూస్తే, హాలీవుడ్ మూవీల్లో ఇండియానా జోన్స్ నాలుగో సీక్వెల్ లోని ఓ పాత్రని ప్రేరణగా తీసుకున్నారట. ఇండియానా జెన్స్ క్రిస్టల్ స్కల్స్ అని వచ్చిన నాలుగో సీక్వెల్ లో హిట్లర్ సైన్యంలోని అధికారిగా ఓ లేడీ హంటర్, హీరో పాత్ర వేసిన ప్రొఫేసర్ ని వెంటాడుతుంది. తన ద్వారా క్రిస్టల్ స్కల్ ని పట్టుకుని తిరిగి ఏలియన్స్ ని కలవాలనుకుంటుంది. ఆప్రాసెస్ లో ఏలియన్సే తనని చంపే పరిస్థితి వస్తుంది. మొత్తంగా విషపు మనస్థత్వం ఉండే ఆ పాత్రనే ప్రియాంక పాత్రకు ప్రేరణగా తీసుకున్నారట.
అందుకోసం ఆ పాత్ర తాలూకు రైట్స్ ని ఇండియానా జోన్స్ టీం నుంచి 30 కోట్లకు ఫిల్మ్ టీం సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఆ పాత్రరైట్స్ 30 కోట్లు, ఆ పాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రాకి ఇచ్చేది 30 కోట్లు.. మొత్తంగా 60 కోట్ల తో లేడీ విలనిజాన్ని రెడీ చేస్తున్నాడు రాజమౌళి.