వంశానికి కొండంత చరిత్ర.. అయినా ఒంటరి పోరాటం లో శిఖరం..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వంశానికి కొండంత చరిత్ర ఉంది. నందమూరి వారసుడిగా, ఎన్టీఆర్ కి జూనియర్ గా దూసుకెళ్ళిన, దూసుకెళుతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇప్పటికీ ఒంటరి పోరాటమే చేస్తున్నాడా? దేవర తన కెరీర్ లోనే హిస్టారికల్ హిట్ అనిపించుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2024 | 02:24 PMLast Updated on: Nov 21, 2024 | 2:24 PM

The Clan Has A History As Old As A Mountain Yet The Peak Is In The Struggle Alone

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వంశానికి కొండంత చరిత్ర ఉంది. నందమూరి వారసుడిగా, ఎన్టీఆర్ కి జూనియర్ గా దూసుకెళ్ళిన, దూసుకెళుతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇప్పటికీ ఒంటరి పోరాటమే చేస్తున్నాడా? దేవర తన కెరీర్ లోనే హిస్టారికల్ హిట్ అనిపించుకుంది. అంతకంటే మూడు రెట్లు త్రిబుల్ ఆర్ మూవీ తో వసూళ్లొచ్చాయి. వరల్డ్ వైడ్ గా పేరొచ్చింది. పాపులారిటీ పెరిగింది. అయినా తన కెరీర్ మొత్తం చూస్తే దేవరనే అసలు సిసలైన హిట్ గా కన్సిడర్ చేయాల్సి వస్తోంది. ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ అనిపించుకునేందుకు మూడు సార్లు గండం తప్పించుకోవాల్సి వచ్చింది. యశ్ , బన్నీ ఇంకా ప్రూవ్ చేసుకునే అవకాశమే రాలేదు. రామ్ చరణ్ ఆవిషయంలో ఆన్ ది వే… అందరికి పాన్ ఇండియా హిట్లున్నా, మరో హిట్ వచ్చేలా ఉన్నా…ఎన్టీఆర్ మాత్రమే ఎందుకు వెరీ వెరీ స్పెషల్… తన ఘనమైన గతంలోతెంతో చూస్తేనే ఆవిషయం అర్ధమౌతుందా?

నందమూరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా, ఎన్టీఆర్ కి మాడ్రన్ వర్షన్ గా జూనియర్ అనిపించుకున్నా ఇలా కొండంత హిస్టరీ ఉన్న వంశంలో పుట్టినా, ఓ అనామకుడిలా, మొదటి నుంచి ఒంటిరపోరాటం చేయటమే కాదు, ఒకే ఒక్కడు అనిపించుకునే రేంజ్ లో మాస్ లో ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న స్టార్ ఎన్టీఆర్

అలాంటి తను పాన్ ఇండియా హీరోలందరిలో వెరీ వెరీ స్పెషల్ అనిపించుకోవటానిక సాలిడ్ రీజనుంది. అది ఇప్పుడిప్పుడే ఎలివేట్ అవుతోంది. ఎన్టీఆర్ మనవడే అయినా హీరోగా ఎంట్రి ఇచ్చినప్పటి నుంచి ఒంటరి పోరాటం చేస్తూనే మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న తారక్ ని త్రిబుల్ ఆర్ మూవీ పాన్ ఇండియా స్టార్ నిచేసింది

కాని దేవర విషయంలో మాత్రం అంతా తానై ముందుకు నడిచాడు, సినిమాను నడిపించాడు తారక్. కొరటాల శివ కంటెంట్ కి, తన ఇమేజ్ కి టాలీవుడ్ ని దాటి దుమ్ముదులిపే క్రేజ్, మార్కెట్ లేదు. కేవలం త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ కి వచ్చిన ఇమేజ్ పుణ్యమానే దేవర మీద క్రేజ్ క్రియేట్ అయ్యింది

అయితే ఆ క్రేజ్ కూడా జనాలను థియేటర్స్ కి రప్పించే వరకు పనికొస్తుంది. ఆతర్వాత వసూళ్ల వరద రావాలంటే సినిమాలో దమ్ముండాలి. లేదా దమ్ముందనిపించేలా హీరో ఆ మూవీని ముందుకు తీసుకెళ్లాలి… అదే జరిగింది

నిజానికి బాహుబలి, బాహుబలి 2 రెండు రాజమౌళి వల్లే పాన్ ఇండియా వసూల్లొచ్చాయి. ప్రభాస్ స్టామినా సాహో తర్వాతే తేలింది. సలార్, కల్కీ తో 750 కోట్లు, 1200 కోట్లు రాబట్టి ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ అయ్యాడు కాని, మధ్యలో తనకి రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి ప్లాపులు పడ్డాయి. అయినా తను కోలకున్నాడు. కాబట్టే నెం.1 పాన్ ఇండియా కింగ్ అయ్యాడు

అలా చూస్తే కనీసం ప్రభాస్ కి బాహుబలి1, బాహుబలి 2 లాంటి వరుస రెండు హిట్లు పడ్డాకే ఆ క్రేజ్ వచ్చింది. ఆతర్వాతే తనేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ మాత్రం త్రిబుల్ ఆర్ తర్వాత వెంటనే తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. దేవరతో రికార్డుల మోత మోగింది.

కాబట్టే పుష్పతర్వాత మళ్లీ పుష్పరాజ్ గానే వస్తున్న బన్నీకంటే, కేజీయఫ్, కేజీయఫ్ 2 తోనే దూసుకెళ్ళిన యష్ కంటే, త్రిబుల్ ఆర్ తో హిట్ మెట్టెక్కి ఇప్పుడు పరీక్షరాయబోతున్న చరణ్ కంటే కూడా పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ తో ఈక్వల్ అనిపించుకునే రేంజ్ ఎన్టీఆర్ కే ఉందంటున్నారు. ఇంత చేసి ఇప్పటికీ వార్ 2 మూవీలో విలన్ గా ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఎందుకంటే, హ్రితిక్ కి ఒకప్పటిలా క్రేజ్ లేదు కాబట్టి, ఆ సినిమా భారం మొత్తం కూడా ఎన్టీఆర్ ఒక్కడే మోయాల్సి వస్తోంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నాకే, తను ఒంటిరి శికరం అనే డిస్కర్షన్ మొదలైంది. తన మీద ఇంకా ట్రోలింగ్ జరగటంవల్లే ఇలాంటి చర్చ షురూ అయ్యింది.