Baby Movie: బేబీ మూవీ ఖాతాలో అరుదైన రికార్డ్
యూత్‌ను ఫిదా చేసిన బేబీ మూవీ మీద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ఈ మూవీ తెరకెక్కగా.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్లలో భారీగా దూసుకుపోతంది.

The collections of Anand Deverakonda and Vaishnavi Chaitanya starrer Baby are not decreasing even after a week
ఇప్పటికే 66కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ సినిమా.. మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. కలెక్షన్ల విషయంలో బేబీ మూవీ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10వ రోజు 3 కోట్ల 40లక్షల రూపాయలు వసూలు చేసి మిడ్ రేంజ్ సినిమాల్లో అత్యధిక షేర్ సాధించిన మూవీగా నిలిచింది. ట్రిపుల్ ఆర్, బాహుబలి 2, వాల్తేరు వీరయ్య, బాహుబలి, ధమాకా, రంగస్థలం, అల వైకుంఠపురంలో, పుష్ప లాంటి స్టార్ హీరోల భారీ చిత్రాలు మాత్రమే బేబీ సినిమా కంటే ముందున్నాయ్. మరే టైర్ 2 హీరోల సినిమాలు కూడా ఆ లిస్టులో లేకపోవడం హైలైట్.
మొత్తంగా చూసుకుంటే బేబీకి 10 రోజుల్లో 66 కోట్ల 6 లక్షల కలెక్షన్లు వచ్చాయ్. కల్ట్ సినిమాగా టాక్ తెచ్చుకుని ఇప్పటికీ కోట్ల వర్షం కురిపిస్తోంది బేబి మూవీ. జూలై 14న రిలీజ్ అయిన ఈ సినిమా.. వంద కోట్ల కలెక్షన్లకు రీచ్ అవుతోంది. ప్రస్తుత రోజుల్లో వారం కంటే ఎక్కువ థియేటర్లలో సినిమాలు ఆడడమే కష్టం అయిపోతోంది. అలాంటిది బేబీ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. మొదటిరోజు 7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. పదో రోజు కూడా దాదాపు అదే టెంపో మెంటైన్ చేస్తోంది.