Salaar 2nd song : ‘సలార్’ సెకండ్ సాంగ్ కు డేట్ ఫిక్స్..!
సలార్ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త లేట్ అయ్యాయి. ఫైనల్‌గా ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో థియేటర్ల దగ్గర జాతరను తలపిస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా 800 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది డైనోసర్.

The countdown to the release of Salar has begun. Advance bookings are already open everywhere.
సలార్ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త లేట్ అయ్యాయి. ఫైనల్‌గా ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో థియేటర్ల దగ్గర జాతరను తలపిస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా 800 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది డైనోసర్. అయితే.. సలార్ టార్గెట్ వెయ్యి కోట్లు కాబట్టి.. హిట్ టాక్ వస్తే ఇదేం పెద్ద టార్గెట్ కాదు. ఎందుకంటే సలార్ హైప్ అలా ఉంది మరి. ఇప్పటికే సలార్ నుంచి బయటికి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి.
టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ అదరగొట్టేశాయి. ముఖ్యంగా సలార్ లేటెస్ట్ ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేసింది. అలాగే అంతకు ముందు వచ్చిన సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే సాంగ్ కూడా ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ సాంగ్ హార్ట్ టచింగ్‌గా ఉండడంతో.. రిపీట్ మోడ్‌లో వింటున్నారు. అయితే సలార్‌లో కేవలం రెండు సాంగ్స్ మాత్రమే ఉంటాయని ముందు నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది కాబట్టి.. ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
డిసెంబర్ 20న, సలార్ నుంచి సెకండ్ సాంగ్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సాంగ్ ఖచ్చితంగా మాస్ బీట్ అయి ఉంటుందని చెబుతున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న సలార్ ఆల్బమ్ కెజియఫ్‌కు మించి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మాస్ సాంగ్ కూడా బయటికి వస్తే సలార్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లడం పక్కా. మరి నెక్స్ట్ వచ్చే సాంగ్ మాస్ సాంగా, టైటిల్ సాంగా లేదంటే ఐటమ్ సాంగా అనేది చూడాల్సి ఉంది.