Big Boss Show: కోర్టు మెట్లెక్కిన బిగ్ బాస్.. ప్రసారం పై రాని క్లారిటీ

బిగ్ బాస్ రియాలిటీ షో మరి కొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు నుంచి వేడి సెగ తగిలింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో ఈ షో కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 27, 2023 | 01:33 PMLast Updated on: Jul 27, 2023 | 1:33 PM

The Court Ordered To Censor Bigg Boss Show After Filing A Public Interest Litigation

బిగ్ బాస్ రియాలిటీ షోను సెన్సార్ చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. ప్రసారం అయ్యాక సెన్సార్ చేస్తే అది పోస్ట్ మార్టం చేసినట్లు ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఈ షో టెలివిజన్ లో ప్రసారం కానంత మాత్రాన న్యాయస్థానం కళ్లు మూసుకొని ఉండదని ధీటుగా బదులిచ్చింది. ప్రసారమాధ్యమాలు కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి వారికి తగిన సూచనలు చేసే విషయాన్ని ఆలోచిస్తామని వెల్లడించింది. ఈ అంశంపై పిల్లిమెడలో గంట కట్టేదెవరనే నానుడిని ప్రస్తావిస్తూ పలువురిని ఆదేశించింది.

విచారణ 4 వారాలకు వాయిదా

ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటూ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టార్ ఇండియా ఫ్రైవేట్ లిమిటెడ్ మాటీవీ, ఎన్డేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్, సినీ హీరో నాగార్జున లకు ఆదేశాలు జారీచేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వలు వెలువరించింది.

బిగ్ బాస్ పై 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు

ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో పూర్తిగా అశ్లీలతను ప్రోత్సహించేదిగా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇవి బుధవారం రోజు విచారణకు వచ్చియి. ఈ కేసు విచారిస్తున్న ఫిటీషనర్ తరఫు న్యాయవ్యాది గుండాల శివ ప్రసాద్ రెడ్డి తనదైన వాదనలు వినిపించారు. సెన్సార్ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి షోలు అందరూ టీవీ చూసే టైం లో కాకుండా రాత్రి 11 నుంచి తెల్లవారి 5 లోపు ప్రసారం అయ్యేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు.

ఇష్టం లేకుంటే ఛానల్ మార్చేయడమే మార్గం

స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాటీవీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. బిగ్ బాస్ షో ప్రసారానికి ముందు సెన్సార్ షిప్ విధానం ఎక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమం ప్రసారం అయ్యాక అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. వాటిని తొలిగించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం ఫిర్యాదులను పరిశీలించేందుకు మూడంచెల భద్రతతో కూడిన వ్యవస్థ ఉందన్నారు. ప్రసారానికి ముందే సెన్సార్ చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని ప్రత్యేక చట్టాని రూపొందించాలని పేర్కొన్నారు. ఇదంతా సుదీర్ఘ కాలంతో కూడిన వ్యవహారం కనుక బిగ్ బాస్ షో నచ్చక పోతే టీవీ ఛానల్ మార్చడమే మనకున్న ఆప్షన్ గా పేర్కొన్నారు. ఇలా చేయడం భావ ప్రకటన హక్కుకు, స్వేచ్ఛకు విఘాతం కల్గించినట్లవుతుందని ఇందులో న్యాయస్థానాల జోక్యం చాలా తక్కువగా ఉంటాయని వివరించారు.

ప్రశ్నాస్త్రాలు సంధించిన న్యాయస్థానం

ఇలా పలువురు న్యాయవాదులు చేసిన వాదనలను పరిగిణలోకి తీసుకుంది ధర్మాసనం. దీనిపై స్పందిస్తూ అభ్యంతర ప్రసారాల విషయంతో ఎవరో ఒకరు బాధ్యత వహించాలి. ఈ ప్రోగ్రాం ప్రసారానికి ముందుగానే సెన్సార్ అవకుంటే ఎలా అని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరింది. అభ్యంతరకరమైన, అశ్లీలమైన దృశ్యాలు ప్రసారం అయ్యాక సెన్సార్ చేసి ఏం ప్రయోజనం అని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వేళ అన్ని ఛానళ్లు ఇలాంటి కంటెంట్ నే ప్రసారం చేస్తుంటే దీనిపై పర్యవేక్షణ ఉండదా.. దీనికి పటిష్టమైన నిఘా, యాంత్రాంగం ఉండకపోతే ఎలా.. కనీసం నైతిక విలువలను కాపాడకపోతే ఎలా అని ప్రశ్నాస్త్రాలు సంధించింది. దీనిపై కొంత వెనక్కి తగ్గిన న్యాయవాదులు సెన్సార్ విషయంలో తగు సూచనలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామని తెలిపారు.

T.V.SRIKAR