Tollywood : ఫ్యూచర్‌లో అన్నీ బ్లాక్ బ్లస్టర్‌లేనా..?
సినీ ఇండస్ట్రీలో (Cine Industry) హీరోలకు ఉండే ట్యాగ్ లైన్లకు ఉండే క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇక.. నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఉండే హీరోల సంగతి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

The craze for tag lines for heroes in the film industry is on a different level.
సినీ ఇండస్ట్రీలో (Cine Industry) హీరోలకు ఉండే ట్యాగ్ లైన్లకు ఉండే క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇక.. నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఉండే హీరోల సంగతి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ప్రజెంట్ టాలీవుడ్ నుంచి ఎక్కువ మంది హీరోలు ప్యాన్ ఇండియా (Pan India) రేసులో దూసుకుపోతున్నారు. బాహుబలితో ప్రభాస్ ఈ రేసును ఎప్పుడో స్టార్ట్ చేయగా.. ట్రిపుల్ ఆర్‌తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (NTR) , పుష్ప-1తో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసి.. నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు తమ కొత్త చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరోల కొత్త ట్యాగ్స్‌పై ఆసక్తి ఏర్పడింది.
ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ హిట్ అవ్వడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్, మెగా పవర్ స్టార్ (Power Star) రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ట్యాగ్ను సంపాదించుకున్నారు. పుష్ప మూవీతో నార్త్ టు సౌత్ మంచి గుర్తింపు సంపాదించుకున్న బన్నీ.. ఆ సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకుని తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించాడు. పుష్ప ముందు వరకు స్లైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ కాస్తా.. ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పటి దాకా ఫ్యాన్స్ పిలుచుకున్న ఈ ముద్దు పేర్లు కాస్తా ఇప్పుడు అఫీషియల్ అయిపోయాయి. ఈ కొత్త ట్యాగ్లతోనే ఈ హీరోలు ముగ్గురూ తమ అప్‌కమింగ్ సినిమాల్లో అలరించనున్నారు.
ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర పోస్టర్స్ లో తారక్ పేరు ముందు మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ వేశారు. రీసెంట్గా దేవర పోస్టర్‌పై అధికారికంగా ఈ పేరును ప్రచురించారు. ఇక రామ్ చరణ్ కు ఉన్న మెగా పవర్ స్టార్ ట్యాగ్ ను తీసి పక్కన పెట్టి.. గ్లోబల్ స్టార్ అని వేశారు బుచ్చిబాబు.. ఇటీవల జరిగిన ఆర్సీ 16 పూజా ఈవెంట్ వీడియోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని వచ్చింది. సుకుమార్ ఇచ్చిన ఐకాన్ స్టార్ ట్యాగ్‌తోనే అల్లు అర్జున్ తన అప్ కమింగ్ మూవీస్‌లో కంటిన్యూ కానున్నాడు. గ్లోబల్ లెవల్ లో అట్రాక్ట్ చేస్తున్న ఈ కొత్త బిరుదులు ఈ ముగ్గురు హీరోలకు ఫ్యూచర్‌లో ఎలా కలిసి రానున్నాయో చూడాల్సిందే..