Devara : దేవర’ విధ్వంసం మొదలైంది.. రికార్డులు బద్దలవ్వాల్సిందే!
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సంక్రాంతి పండుగ కాస్త ముందుగానే మొదలైంది. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన 'దేవర' కొత్త పోస్టర్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక జనవరి 8న గ్లింప్స్ విడుదల కాబోతోంది. అయితే విడుదలకు నాలుగు రోజుల ముందుగానే అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ షురూ చేశారు.

The destruction of 'Devara' has started.. Records must be broken!
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సంక్రాంతి పండుగ కాస్త ముందుగానే మొదలైంది. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ‘దేవర’ కొత్త పోస్టర్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక జనవరి 8న గ్లింప్స్ విడుదల కాబోతోంది. అయితే విడుదలకు నాలుగు రోజుల ముందుగానే అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ షురూ చేశారు.
ఒకప్పుడు వేగంగా సినిమాలు చేస్తాడనే పేరున్న ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ కారణంగా స్పీడ్ తగ్గించాడు. 2018 లో ‘అరవింద సమేత’తో పలకరించిన తారక్.. మళ్ళీ 2022లో ‘ఆర్ఆర్ఆర్’తో సందడి చేశాడు. గత ఆరేళ్లలో ఎన్టీఆర్ నుంచి రెండే సినిమాలు రావడంతో.. ఆయన కొత్త సినిమాలను భారీగా సెలబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు. అందుకే ‘దేవర గ్లింప్స్’ విడుదలకు ముందే హడావుడి చేస్తున్నారు. వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా సరికొత్త రికార్డులు సెట్ చేస్తామంటూ ‘దేవర గ్లింప్స్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ ఉంది.
ఇక దేవర గ్లింప్స్ కూడా అభిమానుల అంచనాలకు మించేలా ఉంటుందట. ఈ గ్లింప్స్ తో దర్శకుడిగా ఓ కొత్త కొరటాల శివను చూడబోతున్నామని అంటున్నారు. ఎన్టీఆర్ లుక్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతాయని.. గ్లింప్స్ విడుదల తర్వాత ఒక్కసారిగా దేవర పేరు నేషనల్ వైడ్ గా మారుమోగిపోవడం ఖాయమని చెబుతున్నారు.