Adipurush: ఆదిపురుష్‌లో మార్పులు.. కొత్త పెట్టిన డైలాగ్స్‌ ఇవే..

హనుమంతుడు మాస్‌ డైలాగ్స్‌ చెప్పడంపై ఫ్యాన్స్‌ చిర్రెత్తిపోయారు. ఎవరితో ఎలాంటి డైలాగ్స్‌ చెప్పిస్తున్నార్రా అంటూ మేకర్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. దర్శకనిర్మాతలు ఎంత వివరణ ఇచ్చినా ఆడియన్స్‌ మాత్రం కన్విన్స్‌ కాలేకపోయారు. దీంతో మేకర్స్‌ ఓ అడుగు వెనక్కి తగ్గారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 22, 2023 | 11:20 AMLast Updated on: Jun 22, 2023 | 11:20 AM

The Dialogues Of The Film Adipurush Have Changed Because Of The Controversy Here Are The New Dialogues
Adipurush: ప్రభాస్‌ రాముడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్‌ సినిమా ఎలాంటి వివాదాలు ఎదుర్కుంటోందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. సినిమా ట్రైలర్‌ నుంచే ఈ సినిమా చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. మధ్యలో ఎడిట్‌ చేసిన ట్రైలర్స్‌ ఆడియన్స్‌ను కాస్త కూల్‌ చేసినా.. సినిమా రిలీజ్‌ అయ్యాక మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది.
ముఖ్యంగా హనుమంతుడు మాస్‌ డైలాగ్స్‌ చెప్పడంపై ఫ్యాన్స్‌ చిర్రెత్తిపోయారు. ఎవరితో ఎలాంటి డైలాగ్స్‌ చెప్పిస్తున్నార్రా అంటూ మేకర్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. దర్శకనిర్మాతలు ఎంత వివరణ ఇచ్చినా ఆడియన్స్‌ మాత్రం కన్విన్స్‌ కాలేకపోయారు. దీంతో మేకర్స్‌ ఓ అడుగు వెనక్కి తగ్గారు. అసలే క్యారెక్టర్ల డిజైన్ విషయంతో ఫ్యాన్స్‌ చిర్రెత్తి ఉన్నారు. ఇక హనుమాన్‌ డైలాగ్స్‌ ఇలాగే ఉంచితే మొదటికే మోసం అనుకున్నారేమో. హనుమంతుడి డైలాగ్స్‌ మారుస్తున్నట్టు ప్రకటించారు. చెప్పినట్టుగానే కొత్తగా వచ్చిన ప్రింట్‌లో హనుమాన్‌ డైలాగ్స్‌ మార్చేశారు. హనుమంతుడు లంకను కాల్చేముందు ఇంద్రజిత్‌తో చెప్పిన డైలాగ్స్‌ చేంజ్‌ చేశారు.
మొదటి ప్రింట్‌లో “గుడ్డ నీ బాబుదే, నిప్పు నీ బాబుదే, కాలేది కూడా నీ బాబుదే” అని ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ప్రింట్‌లో బాబు ప్లేస్‌లో లంకను యాడ్‌ చేశారు. “గుడ్డ నీ లంకదే, నిప్పు నీ లంకదే, కాలేది కూడా నీ లంకే” అంటూ మార్చేశారు. దీంతో హనుమంతుడి డైలాగ్స్‌ వివాదం ముగిసింది. ఇక మిగిలిన వివాదాలకు ఎలా చెక్‌ పెడతారో చూడాలి.