నీ జనరేటర్లో నా శెక్కర, టాలీవుడ్ లో చిల్లర పంచాయితీలు
మంచు ఫ్యామిలీలో విభేదాలు రోజురోజుకీ సినిమా పరిశ్రమ పరువు తీస్తున్నాయి. ఆస్తి తగాదాలు మంచు కుటుంబంలో ఎప్పటినుంచో జరుగుతున్నా... గత వారం రోజుల నుంచి మాత్రం అవి తీవ్ర స్థాయిలో నడుస్తూ వస్తున్నాయి.
మంచు ఫ్యామిలీలో విభేదాలు రోజురోజుకీ సినిమా పరిశ్రమ పరువు తీస్తున్నాయి. ఆస్తి తగాదాలు మంచు కుటుంబంలో ఎప్పటినుంచో జరుగుతున్నా… గత వారం రోజుల నుంచి మాత్రం అవి తీవ్ర స్థాయిలో నడుస్తూ వస్తున్నాయి. మంచు మనోజ్ పై మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు అనుచరులు దాడి చేయడం… ఆ తర్వాత మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టడం అలాగే హాస్పిటల్ కి వెళ్లడం అన్నీ కూడా సంచలనం అయ్యాయి. ఇక మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన రచ్చ కూడా జాతీయస్థాయిలో వైరల్ అయింది.
ఏకంగా మీడియా ప్రతినిధుల పైన మోహన్ బాబు దాడికి దిగడం ఆ తర్వాత మీడియా ప్రతినిధులు మోహన్ బాబు ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలు చేయడం వంటివి కూడా జరిగాయి. అయితే తాజాగా ఈ వివాదాల్లో మరో పరిణామం చోటు చేసుకుంది. మంచు మనోజ్ ఇంటి వద్ద ఉన్న జనరేటర్ లో మంచు విష్ణు పంచదార పోసాడని దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు మంచు మనోజ్ బయట పెట్టారు. ఇక తన కుటుంబానికి రక్షణ లేదని పోలీసులు రక్షణ కల్పించాలి అంటూ విజ్ఞప్తి చేశాడు. ఇది చూసిన సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు.
మంచు విష్ణు చిన్నపిల్లాడి కంటే అద్వానంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తులను బయట సమాజంలో ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఇప్పుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న జనాలు మాత్రం ఇది ఎక్కడ చండాలం అంటూ సోషల్ మీడియాలో వారిని చూసి నవ్వుకుంటున్నారు. ఈ వివాదం త్వరగా ముగిస్తే మంచిదే అని లేకపోతే సినిమా పరిశ్రమ పరువు మొత్తం పోతుందని సినిమా పెద్దలు కూడా మోహన్ బాబుని కోరినట్లు సమాచారం.
అయితే దీని వెనక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని అందుకే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనపడటం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ వివాదాన్ని తాము సామరస్యంగా పరిష్కరించుకుంటామని మంచు మనోజ్ ఇప్పటికే ప్రకటన కూడా చేశాడు. కానీ పరిస్థితి మాత్రం అలా కనబడటం లేదు. మంచు విష్ణు గొడవ కోసమే ప్రయత్నం చేస్తున్నాడు అనే అభిప్రాయం కూడా వినపడుతోంది. సినిమా పరిశ్రమలో అత్యంత బలమైన కుటుంబం అని చెప్పుకునే మోహన్ బాబు కుటుంబంలో ఇటువంటి పరిస్థితులను చూసి ఆయన అభిమానులు కూడా కన్నీరు పెట్టే పరిస్థితి. అసలు ఈ గొడవలు ఆస్తి కోసమా లేకపోతే ఆధిపత్య పోరా అనేది కూడా అర్థం కాని పరిస్థితి.