SSMB29 : SSMB29 మరింత ఆలస్యం..
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో ఆస్కార్ కొట్టి చరిత్ర సృష్టించి.. హాలీవుడ్‌ని తన వైపు చూసేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) తో డైరెక్ట్‌గా హాలీవుడ్ (Hollywood) సినిమానే చెయబోతున్నాడు.

The director hero Rajamouli created history by winning the Oscar with the film RRR.. and made Hollywood look towards him.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో ఆస్కార్ కొట్టి చరిత్ర సృష్టించి.. హాలీవుడ్‌ని తన వైపు చూసేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) తో డైరెక్ట్‌గా హాలీవుడ్ (Hollywood) సినిమానే చెయబోతున్నాడు. ఇప్పటికే హాలీవుడ్‌కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ గట్టిగా జరుగుతోంది. మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లాడు మహేష్. ఇక రాజమౌళి సైలెంట్‌గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటు పోతున్నాడు. స్క్రిప్టు లాక్ చేసి లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే మహేష్ బాబుతో వర్క్ షాప్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. దాని కోసం రెండు నెలలకు పైగానే సమయం పడుతుందని అంటున్నారు.
దీంతో.. ఈ సినిమా లాంచింగ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. వాస్తవానికైతే.. ఈ సినిమాను ఆగష్టులో మహేష్ బర్త్ డే సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) మరింత వెనక్కి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. డిసెంబర్ రెండవ వారంలో ఈ చిత్రం షూట్‌ని మొదలు పెట్టనున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. అప్పటికీ కుదరకపోతే.. కొత్త సంవత్సరంలో కొత్త ముహూర్తం పెట్టుకోవాల్సిందేనని అంటున్నారు.
కానీ రామోజీ ఫిలిం సిటీలో మాత్రం వంద కోట్లతో భారీ సెట్ వేస్తున్నట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. కాబట్టి.. ఒక్కసారి అన్నీ సెట్ అయితే జక్కన్న షూటింగ్‌కు వెళ్లడమే లేట్ అన్నమాట.అందుకే రాజమౌళి.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించలేదని చెబుతున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ లో మహేష్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి.. చిత్ర విశేషాలకు రాజమౌళి వెల్లడించే అవకాశముందట.మామూలుగానే రాజమౌళి సినిమా అంటే.. రెండు మూడేళ్లు పడుతుంది. పైగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన.. ‘SSMB 29’ని మరింత భారీగా రూపొందించాలని చూస్తున్నారు. అయితే ఇది స్టార్ట్ కావడమే 2025 అంటే.. ఇక రిలీజ్ ఎప్పుడవుతుందని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.