Naga Chaitanya: పవర్ ఫుల్ హీరోయిన్ లేకపోతే నాగచైతన్య కష్టమే
చూతూ సినిమాలో నటించడం కోసం ఇద్దరు ప్రతిభ కలిగిన భామలు వెయిటింగ్ చేస్తున్నారు.

The director-producers are in the process of selecting one of Sai Pallavi and Keerthy Suresh for Naga Chaitanya's film
నాగచైతన్యకు జోడీగా మంచి ప్రతిభ కలిగిన నటి కావాలి. చైతు హిట్ మూవీస్ అన్నింటిలోనూ.. హీరోయిన్స్‌కే ఎక్కువ పేరు వచ్చింది. నెక్ట్స్ మూవీ కోసం.. ఇద్దరు టాలెంటెడ్ హీరోయిన్స్‌ను పరిశీలిస్తున్నారు. ఒకరు ఆల్రెడీ చైతుతో జత కట్టగా మరొకరు నేషనల్ అవార్డ్ విన్నర్.
నాగచైతన్య నెక్ట్స్ మూవీ ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. కార్తికేయ2 తీసిన చందు మొండేటి దర్శకుడు కావడంతో.. ఈ సినిమాను కూడా పాన్ ఇండియాలో లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఓ జాలరి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటన ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఫిషర్‌మేన్ క్యారెక్టర్ పరిశీలించడానికి కథ కోసం.. చిత్ర యూనిట్ ఆమధ్య శ్రీకాకుళం వెళ్లి రీసెర్చ్ వర్క్ చేసింది.
నాగచైతన్య పక్కన హీరోయిన్‌గా ఎవరో ఒకర్ని పెడితే సరిపోదు. గ్లామర్ కంటే మాంచి పెర్ఫార్మర్ అయివుండాలి. యాక్టింగ్‌తో మాత్రమే ఆకట్టుకునే సాయిపల్లవి.. మహానటి కీర్తిసురేష్ పేర్లు వినబడుతున్నాయి.
చైతు, సాయిపల్లవి జంటగా ‘లవ్‌స్టోరీ’లో నటించారు. హీరోయిన్ని రిపీట్ చేస్తే.. కాంబినేషన్ ఫ్రెష్‌గా వుండదని కొందరు యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. సాయిపల్లవి కాకపోతే కీర్తి సురేష్ ఎలా ఉంటుందన్న చర్చ కూడా నడుస్తోంది. కీర్తిసురేష్ కు వున్న యాక్టింగ్ బలాన్ని యూజ్ చేసుకోవచ్చన్న ధీమా కూడా మేకర్స్‌లో వుంది. ఫిషర్‌మేన్ కథే అయినా.. నాగచైతన్య ఇంత వరకు హిందీలోకి అడుగుపెట్టకపోయినా.. దర్శకుడు చందు మొండేటి కార్తికేయ2తో హిందీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ఈలెక్కన బాలీవుడ్ హీరోయిన్ని తీసుకుంటే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా మేకర్స్‌లో వుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా వున్న చిత్ర యూనిట్.. త్వరలోనే హీరోయిన్ని ఫైనల్ చేయనుంది.
హీరోయిన్ టాలెంట్ లేకుండా చైతూ సినిమా పండదు. నాగచైతన్య ఏ సినిమా చూసిన.. పవర్ ఫుల్ హీరోయిన్ వల్లే హిట్ అవుతుంది. చైతు కి యాక్షన్ రాకపోవడం, ఎన్ని సినిమాలైనా యాక్షన్ నేర్చుకోలేకపోవడం వల్ల హీరోయిన్ మీద డిపెండ్ అయ్యి సినిమాలు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. సమంతతో చేసిన మూడు సినిమాలు అలా హిట్ అయినవే ఏం మాయ చేసావే.. నుంచి మజిలీ వరకు సమంత.. పైనే చైతు సినిమాలు హిట్ అయ్యాయి . ఆ తర్వాత సాయి పల్లవి కాజల్ ఇలా ఎవరో ఒక గట్టి హీరోయిన్ లేకపోతే నాగచైతన్య పరిస్థితి కష్టమే. అందుకే ఇప్పుడు కొత్త మూవీ కోసం పవర్ ఫుల్ హీరోయిన్ ఉండాల్సిందేనని భావించి వెతుకుతున్నారు దర్శక నిర్మాతలు.