Salar 2 : ‘సలార్ 2’ లేనట్టేనా…
సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్‌కు ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రభాస్ కటౌట్‌ని పర్ఫెక్ట్‌గా వాడుకున్నాడు నీల్.

The elevation given by Prashant Neel in the movie Salaar gave Prabhas fans goose bumps.
సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్‌కు ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రభాస్ కటౌట్‌ని పర్ఫెక్ట్‌గా వాడుకున్నాడు నీల్. ఇక ఖాన్సార్‌లో జరిగిన ఊచకోతను పార్ట్ 1 సెకండాఫ్‌లో శాంపిల్‌గా చూపించిన నీల్, పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో అసలు కథ చెప్పబోతున్నాడు. దీంతో.. సలార్ పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
ప్రభాస్ కూడా సలార్ 2ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ సైతం సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాదిలోనే సలార్ 2 షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. త్వరలోనే సలార్ 2 షూటింగ్ ఉంటుందని చిత్ర వర్గాలు కన్ఫామ్ చేశాయి. కానీ మొన్న ఎన్టీఆర్ బర్త్ డే సదర్భంగా.. ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ ఆగష్టులో సెట్స్ పైకి వెళ్తుందని కన్ఫామ్ చేశారు మేకర్స్
దీంతో.. ఒకేసారి సలార్ 2, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరిగే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు సలార్ 2 ఆగిపోయిందనే వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఎందుకనో ప్రశాంత్ నీల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సలార్ 2 మూవీని వాయిదా వేసి.. ముందుగా ఎన్టీఆర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే.. ఎన్టీఆర్ బర్త్ డే రోజున మైత్రీ మూవీ మేకర్స్ ఆగష్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేసినట్టుగా చెబుతున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి.. సలార్ 2 కంప్లీట్ చేస్తూనే ఎన్టీఆర్ ప్రాజెక్టుని టేకప్ చేయనున్నట్టుగా సమాచారం. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.